ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు: భారీ వర్షాలపై ఢిల్లీ నుంచి కేసీఆర్ సమీక్ష, 14 జిల్లాలకు రెడ్‌అలర్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్రంలో వర్షాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. గులాబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రాణ ఆస్తి నష్టం జరగొద్దంటూ కేసీఆర్ ఆదేశం
ఈ నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు సీఎం కేసీఆర్. పోలీస్, రెవిన్యూ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. అవసరమైతే హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‌లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. మరోవైపు, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎస్‌తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ లు కూడా పాల్గొన్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో బీజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మరోసారి భేటీ అయ్యారు. నార్త్‌బ్లాక్ హోంశాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఆదివారం రాత్రి కూడా అమిత్‌షాతో దాదాపు గంట పాటు భేటీ అయ్యారు కేసీఆర్. ఆదివారం జరిగిన నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సమావేశంలోనూ.. హోమంత్రితో చర్చించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌నూ కలిశారు తెలంగాణ సీఎం కేసీఆర్.
రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణలో రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారింది. ఈ తుఫాను ఉత్తర ఆంధ్రా- దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం, గోపాల్ పూర్, కళింగ పట్నం దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Recommended Video

తెలంగాణలో 14 జిల్లాలకు భారీ వర్షాలు, రెడ్‌అలర్ట్
తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. రాష్ట్రంలో 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications