"రేవంత్ అలా అనడం హాస్యాస్పదమే.. యువతను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు!"

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్ పరిధిలో ఉన్న గౌడవెల్లిలో ఆదివారం నాడు రెడ్డి మహాగర్జన సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. వివిధ పార్టీలు, సంస్థలు, సంఘాలకు చెందిన అనేకమంది రెడ్డి సామాజికవర్గం నేతలంతా ఒక్క తాటి పైకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. తాను సీఎం అయితే రెడ్డి కార్పోరేషన్, రెడ్డి డిమాండ్లపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్నారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అనడం హస్యాస్పదం అన్నారు.

gutha sukender reddy counter to revanth over reddy corporation statement

యువతను రెచ్చగొట్టేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని గుత్తా హితవు పలికారు. రెడ్డి సామాజికవర్గంలో 80శాతం మంది ఆర్థికంగా ఉన్నవారేనని తెలిపారు. అవసరమైతే సంక్షేమ నిధి ఏర్పాటు చేసి రెడ్డి సామాజిక వర్గంలోని పేదలను ఆదుకుంటామని తెలియజేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mp Gutha Sukender Reddy made counter attack on Revanth Reddy's Reddy corporation statements.
Please Wait while comments are loading...