బీజేపీలోకి బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ముహూర్తం ఫిక్స్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త వ్యూహాలతో మూడు ప్రధాన పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ లక్ష్యంగా సీఎం రేవంత్ రాజకీయంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు బీజేపీ తో టచ్ లోకి వెళ్లారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల వేళ బీజేపీలో చేరేందుకు ఈ నేతలు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
గులాబీ పార్టీ నేతలు వరుసగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పార్టీ ముఖ్య నాయకత్వం పైన విచారణలు కొనసాగుతున్నాయి. తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందనేది కీలకంగా మారుతోంది. అటు బీసీ రిజర్వేషన్ల అమలు పైన ఒత్తిడి పెంచటం ద్వారా రేవంత్ భారీ రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో గులాబీ పార్టీకి చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. తాజాగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావుతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీ తరువాత బాల రాజు సహా మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకొనేందుకు సిద్దమయ్యారు.

బీజీపీలోకి గువ్వల చేరికను రాంచందర్ రావు అధికారికంగా ప్రకటించారు. గువ్వల ఈ నెల 11వ తేదీన బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. గువ్వల బాలరాజు బీఆర్ఎస్‌ను వీడిన తర్వాత ఆ పార్టీపై బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపుతానంటూ వేలాది ఫోన్లు వచ్చాయని, ఇంత జరిగినా బీఆర్ఎస్‌లో ఎవ్వరూ తనను పట్టించుకోలేదని బాలరాజు అన్నారు.
ఫాం హౌస్ కేసులో వంద కోట్లకు అమ్ముడుపోయానంటూ తనపై అబాండాలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆదేశాల ప్రకారమే తనకు ఇచ్చిన రోల్‌ను ఫాంహౌస్‌లో పోషించానని, ఆ విషయం పార్టీ పెద్దలకు తెలుసని అన్నారు. బాలరాజు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు.












Click it and Unblock the Notifications