హెచ్1బి షాక్: వేలాది మంది తెలుగు విద్యార్థులకు షాక్ తప్పదా?
హెచ్1బీ వీసాల అంశం తెలుగు వారికి నిద్రలేకుండా చేస్తోంది. ముఖ్యంగా అమెరికాలో చదువు పూర్తి చేసి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ పైన ఉన్న తెలుగు విద్యార్థులకు మార్చి గండం ఉందని అంటున్నారు.
హైదరాబాద్: హెచ్1బీ వీసాల అంశం తెలుగు వారికి నిద్రలేకుండా చేస్తోంది. ముఖ్యంగా అమెరికాలో చదువు పూర్తి చేసి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ పైన ఉన్న తెలుగు విద్యార్థులకు మార్చి గండం ఉందని అంటున్నారు.
ఒక ఏడాది మాత్రమే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ ఉద్యోగం చేసుకోడానికి గడువు విధించడం, అది మార్చితో పూర్తి కానుండడంతో దాదాపు పదివేల మంది తెలుగు విద్యార్థులు కలవరానికి గురువుతున్నారట.
ఆ తర్వాత రెండు నెలల్లో వారు హెచ్1బీ వీసా సంపాదించుకోవాలి. లేదంటే వారు తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఏపీ, తెలంగాణల నుంచి వేలాది మంది విద్యార్థులు హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్తున్నారు.

వారు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగులో..
మూడేళ్ల క్రిందట వెళ్లిన వారు రెండేళ్లు ఎంఎస్ పూర్తి చేసి, ఏడాది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ పైన ఉద్యోగం చేస్తున్నారు. అది పూర్తయ్యాక మరో రెండేళ్ల గడువు పెంచుతారు.

కేసులో ఆ బోర్డు
ఎక్కువ మంది విద్యార్థులు అమెరికాలోని అక్రిడేషన్ కౌన్సెల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ బోర్డు అనుబంధ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చేరారని, అయితే ఆ తర్వాత ఆ బోర్డును అమెరికా ప్రభుత్వం గత ఏడాది రద్దు చేసింది. బోర్డు కోర్టుకు వెళ్లింది.

వేలాది మంది తెలుగోళ్లు
పై బోర్డు అనుబంధంగా ఉన్న విద్యా సంస్థల్లో మన వాళ్లు చాలామంది ఉన్నారు. గత వేలాది మంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ పైన ఉద్యోగం చేస్తున్నారు. ఇలా చేస్తున్న వారు దాదాపు పదివేల మంది ఉండి ఉంటారని అంటున్నారు.

ఈ నెలతో ముగియనున్న గడువు
వారందరికీ ఫిబ్రవరి నెలతో గడువు పూర్తవుతుంది. వారు దేని ద్వారా వెళ్లారో ఆ బోర్డు రద్దవవడంతో వారి గడువు పొడిగింపు ఉండదని అంటున్నారు. అయితే, ఆ తర్వాత రెండు నెలల వరకు అక్కడ ఉండవచ్చునని, ఆ తర్వాత మాత్రం కుదరదంటున్నారు. దీంతో విద్యార్థులలో ఆందోళన నెలకొంది.

ఊరట ఇలా..
అయితే, కొందరు విద్యార్థులకు కంపెనీ నుంచి ఊరట లభించే అవకాశముంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ పైన ఉద్యోగం చేసే కంపెనీ నుంచి విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. తమ కంపెనీలో ఖాళీలు ఉన్నాయని కంపెనీ ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తుంది.

ప్రత్యామ్నాయం
ఓపీటీపై ఉద్యోగం చేసే కంపెనీ నుంచి విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. అంటే తమ కంపెనీలో ఖాళీలున్నాయని కంపెనీయే ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తుంది. తెలుగు విద్యార్థులు పలువురు రెండు, మూడు దరఖాస్తులు చేస్తుంటారు. కన్సల్టెన్సీలకు కొంత డబ్బులిచ్చి చిన్నచిన్న కంపెనీల ద్వారా కూడా దరఖాస్తు చేస్తుంటారు. అంతేకాదు, ఏప్రిల్‌లో అవకాశం రాకుంటే మరో విశ్వవిద్యాలయంలో చేరి ఇంకో ఎంఎస్ చేయడమే ప్రత్యామ్నాయమని అంటున్నారు.












Click it and Unblock the Notifications