తెలంగాణకు అత్యంత శుభవార్తను వినిపించిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణలోని రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్ న్యూస్ వినిపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో 69 రైళ్లకు కొత్తగా 10 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. కొత్తగా హాల్టింగ్ కల్పించిన స్టేషన్ల నుంచి ప్రయోగాత్మకంగా రాబోయే ఆరు నెలల్లో ఎంత ఆదాయం వస్తుందనే విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. పర్వాలేదు అనిపించే స్థాయిలో ఆదాయం ఉంటే హాల్టింగ్ సౌకర్యాన్ని కొనసాగిస్తారు. అలాకాకుండా ఆదాయం తగ్గితే హాల్టింగ్ సౌకర్యాన్ని కొనసాగించడం చాలా కష్టమవుతుంది.
ఆ సమయంలో ఆయా స్టేషన్లలో కచ్చితంగా హాల్టింగ్ కావాలనుకునే ప్రయాణికులు కేంద్రానికి చెందిన ప్రజాప్రతినిధులద్వారా రికమండేషన్ చేయించుకోవడంతోపాటు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తేనే అవి నిలుస్తాయి. లేదంటే మూణ్నాళ్ల ముచ్చటగా మారుతుంది. దీంతో ఆయా రైళ్లకు కొత్తగా కల్పిస్తున్న స్టేషన్లద్వారా ఆదాయాన్ని తెప్పించాల్సిన బాధ్యత కూడా ప్రయాణికులపై పడుతుంది. ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దశలవారీగా రైళ్లను కొత్త స్టేషన్లలో నిలపబోతున్నారు. ఏ రైళ్ల, ఏ స్టేషన్లలో నిలవబోతున్నాయో తెలుసుకుందాం.

బెల్లంపల్లి రైల్వేస్టేషన్
సికింద్రాబాద్-రాయ్‌పూర్ (12771),
నిజాముద్దీన్-తిరుపతి (12708)
ఖమ్మం రైల్వేస్టేషన్
ఎర్నాకుళం-పాట్నా (22699)
మధిర రైల్వేస్టేషన్
తిరుపతి-సికింద్రాబాద్ (12763),
విశాఖపట్నం-మహబూబ్‌నగర్ (12861)
మంచిర్యాల రైల్వేస్టేషన్
నిజాముద్దీన్ - తిరుపతి(12708),
ఎర్నాకుళం-పాట్నా (22699)
రామగుండం రైల్వేస్టేషన్
బెంగళూరు-దానాపూర్ (12295),
ఎర్నాకుళం-పాట్నా (22699)
మిర్యాలగూడ రైల్వేస్టేషన్
భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015),
నాగర్‌సోల్-నర్సాపూర్ (17232)
నల్గొండ రైల్వేస్టేషన్
నర్సాపూర్-లింగంపల్లి (17255),
నాగర్‌సోల్-నర్సాపూర్ (17232)
మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్
నాగర్‌సోల్-చెన్నై (16004)
పెద్దపల్లి రైల్వే స్టేషన్
సికింద్రాబాద్-రాయ్‌పూర్ (17271),
రాయ్‌పూర్-సికింద్రాబాద్ (17272),
అహ్మదాబాద్-చె న్నై సెంట్రల్ (12655)
వరంగల్ రైల్వే స్టేషన్
చెన్నై సెంట్రల్-నిజాముద్దీన్ (12611),
నిజాముద్దీన్-చెన్నై సెంట్రల్ (12612)












Click it and Unblock the Notifications