మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్‌కు ఓటేస్తే పెళ్లిళ్లు కావడం లేదు: హరీష్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: గత అరవై ఏళ్లుగా కాంగ్రెస్‌కు ఓటేసినందుకు పెళ్లిళ్లు కూడా కావడం లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు టి. హరీష్ రావు వ్యాఖ్యానించారు. గ్రామాలు, తండాల్లో నీటిసమస్య కారణంగా ఎవరూ పిల్లనివ్వడం లేదని పలు సమావేశాల్లో మహిళలు చెబుతున్నారని ఆయన అన్నారు.

నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు బతుకుదెరువు చూపకుండా, కనీసం తాగునీటి సదుపాయం కల్పించని కాంగ్రెసు నాయకులు ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్లి ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారని ఆయన అన్నారు. పదేళ్ల పాటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్కెటింగ్‌శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ తన అం దోల్ నియోజకవర్గంలో మూడు మార్కెట్‌యార్డులు ఏర్పా టు చేశారని, నారాయణఖేడ్‌లో మాత్రం ఒక్క మార్కెట్‌యా ర్డు కూడా ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు.

Harish Rao appeals to the voters to reject Congress

శుక్రవారం మెదక్ జిల్లా నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, మనూరు మండలాల్లో మంత్రి పర్యటించి పలు సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారాయణఖేడ్‌లో మార్కెట్‌యార్డులు, సబ్‌స్టేషన్‌లు, కాలేజీలు, రోడ్లు, దవాఖానల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నదని, ఇవి కాంగ్రెస్ నేతలు రాజనర్సింహ, సునీతారెడ్డి, సురేశ్‌శెట్కార్‌లకు కనిపించడం లేదా అని అన్నారు.

కాంగ్రెస్ వాళ్ల మొసలి కన్నీరుకావాలా, టీఆర్‌ఎస్ ఇచ్చే మంచినీరు కావాలో ప్రజలే తేల్చుకోవాలని ఆయన అన్నారు. గోదావరి జలాలను సింగూరుకు తెచ్చి ఖేడ్ పొలాల్లో పారిస్తామని, సింగూరు ద్వారా జిల్లాలో 5.5 లక్షల ఎకరాలకు సాగునీరందింస్తామన్నారు. టీడీపీ తెలంగాణలో కనుమరుగైందని,ఆ పార్టీ గురించి మాట్లాడడం అనవసరమన్నారు. వరంగల్ ఎంపీ ఉప ఎన్నిక తరహాలో కాంగ్రెస్, టీడీపీ డిపాజిట్లు గల్లంతు చేసేలా తీర్పు ఇవ్వాలని కోరారు.

దేశంలోనే ఆదర్శరాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, కెసిఆర్‌కు మద్దతు తెలుపడంలో నారాయణఖేడ్ ప్రజలు ముందువరుసలో ఉండాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కోరారు.

నారాయణఖేడ్‌ను అభివృద్ధి చేయకుండా గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, వెనుకబాటుతనానికి మద్దతు తెలిపినట్లేనన్నారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ ఎమ్యెల్యే అభ్యర్థి ఎం భూపాల్‌రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్యెల్యేలు రామలింగారెడ్డి, హన్మంతు షిండే, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యానారాయణ, రాష్ట్ర గీత పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మెన్ విగ్రాం రామాగౌడ్ పాల్గొన్నారు.

English summary
Telangana minister and Telangana Rastra Samithi (TRS) leader Harish Rao appealed Narayanakhed voters to reject Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X