Harish Rao: నిరూపించండి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
Harish Rao:ఎస్ఎల్బీసీ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు జరగలేదని సీఎం రేవంత్ నిరూపించాలన్నారు. ఎస్ఎల్బీసీ పనులు చేయలేదని చేయలేదని సీఎం నిరూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. లేని పక్షంలో రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
ఎస్ఎల్బీసీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని.. ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్నా, గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎడగడతామన్నారు. ఎస్ఎల్బీసీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ కోసం రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చుచేసి 11 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పుకొచ్చారు.

ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని పేర్కొన్నారు. తాను చెప్పింది అబద్ధమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. తాను ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లినట్లు సీఎం రేవంత్ అంటున్నారని.. తన మిత్రుడు, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కూతురి పెళ్లి వేడుకకు వెళ్లినట్లు హరీష్ రావు వెల్లడించారు.
ఆదివారం వనపర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీని సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందువల్లే 8 మంది ప్రాణాలు కోల్పోయారని.. ఆ పాపం కేసీఆర్ దేనని రేవంత్ విమర్శలు గుప్పించారు. కృష్ణానదిలో తెలంగాణ నీటి వాటా తేల్చకుండా ఆంధ్రాకు తరలించేలా సంతకాలు చేసింది కేసీఆరే అని.. ఆ పాపం వల్లే పాలమూరు ప్రాజెక్టులు పడావు పడ్డాయన్నారు ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగినప్పుడు హరీష్ రావు దుబాయ్ లో దావత్ చేసుకోలేదా అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.












Click it and Unblock the Notifications