చెత్తను తీసి.. నీటిని తొలగించి : మంత్రి హరీష్ రావు స్వయంగా..!!

మంత్రి హరీష్ రావు స్వయంగా పరిసరాలను శుభ్రపరిచారు. రాష్ట్రంలో డెంగీ నివారణలో భాగంగా ఇప్పటికే మంత్రి కొన్ని కీలక సూచనలు చేసారు. సాధారణ ప్రజలకు కొన్ని అంశాల్లో పిలుపు నిచ్చారు. అయితే, ముందుగా తానే వాటిని చేసి చూపించాలని నిర్ణయించారు. అందులో భాగంగా..మంత్రి తన నివాస ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్రపరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.

హరీష్ స్వయంగా శుభ్రపరుస్తూ

హరీష్ స్వయంగా శుభ్రపరుస్తూ


డెంగీ నివారణకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇంటి చుట్టూ ఉన్న చెత్తా, చెదారం, నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాలని సూచించారు. మంత్రి హరీష్ తాను ముందుగా చేసి ఆదర్శం గా నిలవాలనే ఉద్దేశంతో మొక్కల తొట్లను క్లీన్‌ చేశారు. ప్రజలంతా ఇంట్లో నీళ్లు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. పగటిపూట దోమలు కుట్టడమే డెంగీకి ప్రధాన కారణమన్నారు. దీనిని ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందన్నారు.

డెంగీ నివారణలో భాగస్వాములు కావాలంటూ


డెంగీని ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్ స్పష్టం చేసారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్​ సహా 9 జిల్లాల్లో విష జర్వాలు పంజా విసురుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను మలేరియా వణికిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌పై 'ఏడిస్‌ ఈజిప్టి' దోమ విరుచుకుపడుతోంది.

భారీ సంఖ్యలో నమోదవుతున్న డెంగీ కేసులు

భారీ సంఖ్యలో నమోదవుతున్న డెంగీ కేసులు


దీంతో,..మంత్రి స్వయంగా డెంగీ నివారణ పైన అవగాహన పెంచేందుకు స్వయంగా పరిసరాల పరిశుభ్రత ప్రారంభించారు. ప్రతీ ఆదివారం ప్రతీ ఒక్కరూ ఈ విధంగా ముందుకు రావటం ద్వారా డెంగీ నివారణ సాధ్యపడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పుడు మంత్రిగా హరీష్ డెంగీ నివారణ కోసం చేసిన పనితో వైద్య శాఖ అధికారులు మొత్తం జిల్లాల్లో ప్రారంభించనున్నారు. అదే విధంగా భారీ వర్షాలు..వరద నీరు నిల్వ ఉన్న ఈ సమయంలో మరింత అప్రమత్తం అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+