అసలు ఏం చేశారని ఓటేస్తారు?: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సూటి ప్రశ్న

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. వందరోజుల పాలన చూసి ఓటేయాలని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని.. ఈ వంద రోజుల పాలనలో ఏముందని ప్రశ్నించారు. ఆయన బుధవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ప్రజాపాలనలో పెన్నులు గన్నులయ్యాయని ఎద్దేవా చేశారు.

తాము అధికారంలో ఉన్న సమయంలో ఉన్నప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా? అంటూ ప్రశ్నించారు హరీశ్ రావు. జర్నలిస్టులు సచివాలయంలో అన్ని ఫ్లోర్లు స్వేచ్ఛగా తిరిగేవారని.. ప్రస్తుతం సచివాలయంలో విలేకరులకు ఎందుకు స్వేచ్ఛ లేదని హరీశ్‌రావు నిలదీశారు. నిధుల దుర్వినియోగమని చెప్పినవారు ఆరుగురిని పీఆర్వోలుగా ఎందుకు పెట్టుకున్నారని హరీశ్ రావు ప్రశ్నలు గుప్పించారు.

Harish Rao hits out at cm revanth reddy for congress 100 days administration

వైట్‌ పేపర్‌, బ్లాక్‌ పేపర్‌ అంటూ ప్రధాని మోడీకి లవ్‌ లెటర్‌ రాశారని హరీశ్ విమర్శలు గుప్పించారు. రేవంత్‌ ప్రజలనే కాదు.. కాంగ్రెస్‌ను కూడా మోసం చేస్తున్నారన్నారు. మళ్లీ మోడీనే ప్రధాని అవుతారన్నట్లు రేవంత్‌ మాట్లాడారని.. కాంగ్రెస్‌ గెలవదని రేవంత్‌ చెప్పకనే చెప్పారన్నారు హరీశ్‌రావు. గుజరాత్‌ మోడల్‌ నిరంకుశమని రాహుల్‌ అన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే, రేవంత్‌ మాత్రం గుజరాత్‌ మోడల్‌ కావాలంటున్నారని.. గుజరాత్‌ మోడల్‌ ఫెయిల్‌ అంటూనే అదే మోడల్‌ కావాలంటున్నారని హరీశ్ రావు విమర్శలు చేశారు.

డిసెంబర్‌ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు మండిపడ్డారు. కనీసం బడ్జెట్‌లోనూ రైతు రుణమాఫీ నిధుల కేటాయింపులు లేవన్నారు. రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని ఇంత వరకు ఇవ్వలేదన్నారు. వచ్చే యాసంగికైనా రూ.500 బోనస్‌ ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

నిరుద్యోగులకు రూ.4వేలు ఇస్తామని ఊసెత్తడం లేదని, ఆటో అన్నలకు రూ.12వేలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇవాళ రూ.16 వేలకోట్లు అప్పులు చేశారని.. ఇంకా అప్పు కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఉచిత విద్యుత్ అర్హులందరికీ అందడం లేదన్నారు. మరి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రాహుల్‌ ప్రధాని అవుతాడన్నప్పుడు.. మోడీ సహకారం ఎందుకు కావాలని అడుగుతారని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ తమ ఎంపీలను లాగేసుకుంటుందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతోనే కరువొచ్చిందని.. ట్యాంకర్ల ద్వారా వరిపంటకు నీళ్లుపోయాల్సిన దుస్థితి ఎదురైందని హరీశ్ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్లు ఇస్తామన్నారని.. కనీసం రూ.2వేల పింఛన్‌ను నెలనెలా ఇవ్వడం లేదని.. ఒక నెల ఎగొట్టారని హరీశ్ విమర్శించారు. ఆరు గ్యారంటీల్లో 13హామీలు ఉన్నాయని.. అవన్నీ అమలయ్యేది ఎప్పుడు? అని ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా చేస్తామని చెప్పి.. ఇప్పుడు రక్తంపిండి వసూలు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+