పవన్ కళ్యాణ్, షర్మిలపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ఏకే 47 అని, ఆయన ముందు డీకేలు, పీకేలు పని చేయరని.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు (harish rao) అన్నారు. డీకేలు, పీకేలు.. ఏకే 47 లాంటి కేసీఆర్ ముందు నిలువలేరన్నారు.

ఎన్నికలు అన్నప్పుడు పోటీ సహజమే అన్నారు హరీశ్ రావు. కాబట్టి గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలలో కేసీఆర్‌పై ఎవరు పోటీ చేసినా స్వాగతిస్తామన్నారు. కొంతమంది కేసీఆర్‌పై పోటీ పేరుతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, పెద్దవారిపై పోటీ చేస్తే తామేదో పెద్దవారం అవుతామని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.ఈ రాష్ట్రంలో కేసీఆర్‌కు సరితూగే నాయకుడు లేరన్నారు. కాగా, కేసీఆర్‌పై గజ్వేల్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్, కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Harish Rao hits out at pawan kalyan and ys sharmila

ముఖ్యమంత్రి కష్టపడి తెలంగాణను తీసుకు వచ్చారన్నారు హరీశ్. రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులు అంతా ఒక్కటవుతున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ద్రోహులు అని అన్నారు హరీశ్ రావు. పవన్ బీజేపీకి మద్దతిస్తే.. షర్మిల కాంగ్రెస్‌కు అండగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే గజ్వేల్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

మరోవైపు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మల్కాజిగిరిలో మంచితనానికి, రౌడీయిజానికి మధ్య పోటీ జరుగుతోందన్నారు. బుధవారం మల్కాజిగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మైనంపల్లి పైసల మైనాన్ని ఓటుతో కరిగించాలని పిలుపునిచ్చారు.

హన్మంతరావు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయనలా నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదన్నారు. అలాంటి వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మరోసారి కేసీఆర్ ప్రభుత్వం రావాలన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు సీఎం పదవి కోసం హైదరాబాద్‌లో మత కలహాలు సృష్టించారన్నారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని చెప్పారు హరీశ్ రావు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే కారుకు ఓటేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+