తెలంగాణలో చంద్రబాబు కుట్రలు సాగవు: తేల్చేసిన హరీశ్ రావు
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు చేసినా, అవి తెలంగాణలో చెల్లబోవని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో అధునాతన వసతులతో నిర్మించిన రైతుబజార్‌ను ఆదివారం మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇక్కడి ప్రాజెక్టులను ఎలాగైనా అడ్డుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతో కేంద్రానికి లేఖలు రాస్తున్నారని ఆరోపించారు. బాబు కుట్రలు తెలంగాణ ప్రాజెక్టులను ఆపలేవని, ఆరునూరైనా, ఇక్కడి అవసరాల నిమిత్తం ప్రాజెక్టులు కట్టే తీరుతామని స్పష్టం చేశారు.

తమ ప్రాజెక్టులకు చంద్రబాబు అనుమతి అవసరం లేదని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, గోదావరి, కృష్ణా నదులపై చేపట్టిన నిర్మాణాలను ఆపే సమస్యే లేదని హరీశ్ రావు తేల్చి చెప్పారు.
రైతు బజార్ల ద్వారా వినియోగదారులు, రైతులకు మేలు జరగాలని సూచించారు.
ఎక్కువ కూరగాయలు మార్కెట్‌కు వచ్చేలా చూడాలని, నిత్యం తాజా కూరగాయలు అందుబాటులోకి తేవాలని రైతులను కోరారు.
ఉద్యానశాఖ ద్వారా రైతులకు నాణ్యమైన కూరగాయల విత్తనాలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. కరీనంగర్‌లో శీతలగిడ్డంగి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications