సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ రాజకీయాలు, హరీష్ హెచ్చరిక..!!
ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా మాజీ మంత్రి హరీష్ సంచలన ఆరోపణలు చేసారు. మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ వేసే ప్రతి అడుగు వెనుక భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని అన్నారు. పేదల కు డబ్బులు లేవని చెప్పే ముఖ్యమంత్రికి.. వందల కోట్లతో క్యాంపు ఆఫీసులకు పైసలు ఎక్కడివని ప్రశ్నించారు. హైదర్‌షా కోటలో మూసీ బాధిత కుటుంబాలకు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్‌మెంట్ బాధిత కుటుంబాలను పార్టీ నేతలతో కలిసి హరీష్ పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీ కరణ పనులు చేపడుతోందని.. అవసరమైతే కేసీఆర్ ఈ అపార్ట్‌మెంట్‌కు వస్తారని తెలిపారు. ఈ అపార్ట్‌మెంట్‌కు గతంలో కేసీఆర్ మూడుసార్లు వచ్చారని ప్రస్తావించారు. ఆ నివాస భవనం వారికి ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ పేదల బతుకులను కూల్చవద్దని ఆయన హితవు పలికారు. కేసీఆర్‌కు మధు పార్క్ అపార్ట్‌మెంట్‌తో మర్చిపోలేని అనుబంధం ఉందని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ ఈ అపార్ట్‌మెంట్‌కు మూడుసార్లు వచ్చారని.. టీఆర్ఎస్ పార్టీ పాలసీ విజన్ డాక్యుమెంట్‌ను ఇక్కడి వార్ రూముల్లో కూర్చునే తయారు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఇక్కడ మంచినీళ్లు లేక మీరు అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి వెళ్లిపోతామంటే, అప్పటికప్పుడు HMWS అధికారులను ఆదేశించి ప్రత్యేక పైపులైన్ వేశారని తెలిపారు. అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో బటన్ ఆన్ చేయించి మరీ మీకు నీళ్లు ఇచ్చారన్నారు.

బాధితులకు అండగా నిలుస్తాం
ఈ అపార్ట్‌మెంట్ వారిని కాంగ్రెస్ సర్కార్ ఇబ్బంది పెట్టొద్దని ఈ సందర్భంగా హరీశ్ రావు కోరారు. పేదలకు అండగా ఉండాలని కేసీఆర్ తమను ఇక్కడకు పంపించారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పాలసీ డాక్యుమెంట్ కోసం కేసీఆర్ ఇక్కడి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారని ప్రస్తావించారు. కేసీఆర్ ఈ అపార్ట్‌మెంట్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారని.. రేవంత్ మాత్రం కూల్చేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా కేసీఆర్ పనిచేశారని చెప్పుకొచ్చారు. మూసీ మురికి పోవాలని బీఆర్ఎస్ ఎప్పుడో పని ప్రారంభించిందన్నారు. రూ. 4000 కోట్లతో ఎస్టీపీలను నిర్మించామని తెలిపారు. గోదావరి జలాలు మూసీకి తీసుకురావాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందన్నారు. రేవంత్‌రెడ్డి ఏది చేసినా.. భూముల పంచాయతీ, రియల్ ఎస్టేట్ చేస్తారని ఆరోపించారు. మూసీ సుందరికీరణ పేరుతో పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చేలా రేవంత్ ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే విమర్శించారు. అసెంబ్లీలో అపార్ట్‌మెంట్ వాసుల తరఫున తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications