• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్‌ని ఓడించాలని హరీష్‌రావు ఫోన్, ఫండ్ ఇస్తానంటే అందుకే వద్దన్నా: బాంబుపేల్చిన వంటేరు

|

గజ్వెల్/సిద్దిపేట: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి (ఆపద్ధర్మ) హరీష్ రావు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో టచ్‌లో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఓడించాలని తనకు ఫోన్ చేశారని పెద్ద బాంబు పేల్చారు.

అయితే ఈ వార్తలను హరీష్ రావు తీవ్రంగాఖండించారు. తాను అలా చెప్పినట్లు ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. గజ్వెల్‌లో కేసీఆర్ గెలుపు ఖాయమని, కాంగ్రెస్ పార్టీ తెరాసను టార్గెట్ చేసుకొని అబద్దాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు, వంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై చర్యలు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసీఆర్‌ను ఓడించాలని హరీష్ రావు ఫోన్ చేశారు

కేసీఆర్‌ను ఓడించాలని హరీష్ రావు ఫోన్ చేశారు

గజ్వెల్‌లో శనివారం పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. గజ్వెల్ నియోజకవర్గంలో కేసీఆర్‌ను ఓడించాలని హరీష్ రావు తనకు ఫోన్ చేశారని, ఇందుకోసం ఎలాంటి సాయమైనా చేస్తానని చెప్పారని, తెరాసలో అంతర్గత విభేదాలు ఉన్నాయని, కేటీఆర్‌ను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, తనను రాజకీయంగా ఎదగనీయడం లేదని హరీష్ రావు వాపోయారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం ఓడిపోతేనే కుటుంబ పాలన పోతుందన్నారు.

ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు

ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు

గజ్వెల్ నియోజకవర్గంలో తనకు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందేనని, దాంతో కేసీఆర్‌ను ఓడించాలని, అవసరమైతే ఆర్థిక సాయం చేస్తానని హరీష్ రావు తనకు చెప్పారని వంటేరు అన్నారు. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆయన అలా ఉన్నంత కాలం తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని హరీష్ రావు తనతో చెప్పారన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు ఆర్థికంగా సాయం చేస్తానని హరీష్ రావు చెబితే తాను నో చెప్పానని అన్నారు. అది పాపపు సొమ్ము అని, అందుకే వద్దని చెప్పానని అన్నారు.

వేరే నెంబర్ నుంచి ఫోన్ కాల్

వేరే నెంబర్ నుంచి ఫోన్ కాల్

తనకు హరీష్ రావు నెంబర్ నుంచి కాకుండా, మరో ప్రయివేటు నెంబర్ నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చిందని వంటేరు చెప్పారు. హరీష్ రావుకు తన పార్టీలో పెద్దగా గౌరవం లేదని చెప్పారు. అక్కడ అవమానాలకు గురవుతుండం వల్ల కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని చెప్పారు. తనకు గజ్వెల్ ప్రజల అండ ఉందని చెప్పారు. కేసీఆర్ కుటుంబం మొత్తం వచ్చి గజ్వెల్‌లో ప్రచారం చేసినా తన గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పారు.

దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు సిద్ధం

దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు సిద్ధం

హరీష్ రావు పైన తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవమని, వాటి విషయమై దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు సిద్ధమని వంటేరు చెప్పారు. కాగా, ఈ వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. హరీష్ తమ పార్టీ అధ్యక్షులు రాహుల్‌తో, సోనియా గాంధీతో టచ్‌లో ఉన్నారని, త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నారు. కొంగరకలాన్ సభ తర్వాత 108 సభలు పెడతానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former MLA Vanteru Pratap Reddy, the proposed Congress candidate from the Gajwel Assembly constituency against caretaker Chief Minister K. Chandrasekhar Rao, on Saturday alleged that TRS strongman T. Harish Rao had asked him to defeat the TRS president and assured that he would give him the required money to do so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more