రేవంత్ కు హరీష్ సవాల్..!!
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మూసీ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ముఖ్య నేతల అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కేటీఆర్ సైతం తాను అరెస్ట్ కు సిద్దమంటూ తేల్చి చెప్పారు. రేవంత్ తాజాగా మహారాష్ట్రలో కాంగ్రెస్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో తాము అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ వ్యాఖ్యల పై కౌంటర్ చేసిన హరీష్ సీఎం కు సవాల్ చేసారు.
హరీష్ సవాల్
ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ నేత హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గ్యారేజ్ కు పోయానని విమర్శలు గుప్పించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వటం పై మహారాష్ట్రలో రేవంత్ అబద్దాలు చెప్పారని ధ్వజమెత్తారు. 40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారని విమర్శించారు. ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ జరగాల్సి ఉందని చెప్పుకొచ్చారు. పూర్తి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణలో మోసం చేసినట్లు మహారాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది పూర్తవుతున్న ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని విమర్శించారు.

చర్చకు సిద్దం
ఏ హామీలు అమలు చేశారో.. ఎక్కడ చర్చిద్దామో చెప్పండని.. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమని హరీష్ సవాల్ చేసారు. అభయహస్తంలో మొదటి హామీ మహిళకు రూ. 2500 దిక్కులేదు మొదటి హామీకి దిక్కేలేదన్నారు. ఒక్కో మహిళకు రూ. 27,500 ప్రభుత్వం బాకీ ఉందని.. కానీ రేవంత్ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. రుణమాఫీపై మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 2023 రుణమాఫీ చేస్తామని మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. 42 లక్షల మందికి రూ.31 వేల కోట్ల చేస్తామని.. రూ.17వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. రుణమాఫీ చేశామని ట్విట్టర్‌లో ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
హామీలు అమలు కాలేదు
బ్యాంకులు ముక్కుపిండి రైతుల నుంచి వడ్డీలు వసూలు చేశాయని.. ప్రభుత్వం ఆలస్యం చేయటంతో రైతులపై వడ్డీ భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు అబద్ధాలు కాదు తెలంగాణలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నిజాన్ని చెప్పాలని హితవుపలికారు. రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. రైతు భరోసా ఇచ్చామని చెప్పగలరా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ఇచ్చారా.. రైతు కూలీలకు ఇచ్చిన హామీ ఇవ్వలేదని చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా బోనస్ వస్తుందా రేవంత్ చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి రూ. 26 వేల పెన్షన్ కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందని అన్నారు. 41 లక్షల మంది పెన్షన్ దారులకు ప్రభుత్వం బాకీ పడిందని.. ఇవన్ని అమలు చేయలేదని రేవంత్ చెబితే బాగుండేదని అన్నారు.10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications