Harish Rao: ఇదేనా ప్రజాస్వామ్యం.. హరీశ్ రావు ఫైర్..

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ను పరామర్శించేందుకు వెళ్తున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరామర్శించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఇదేనా మీ ప్రజా పాలన? అని నిలదీశారు.ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన నాయకులకు నిరుద్యోగుల ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు చేసిన వారిని తక్షణం వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు.

"గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ను పరామర్శించేందుకు వెళ్తున్న బిఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన నాయకులకు నిరుద్యోగుల ఆవేదన ఎందుకు అర్థం కావడం లేదు. అక్రమ అరెస్టులు చేసిన వారిని తక్షణం వదిలిపెట్టాలని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తున్నాం" అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

Harish Rao reacted to Janagama MLA Palla Rajeswara Reddy s arrest

ఆదివారం హరీశ్ రావు మోతీలాల్ నాయక్ ను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగులు తరఫున బిఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు.

నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందన్నారు. మోతీలాల్ కు ఏం జరగక ముందే ప్రభుత్వం తక్షణ స్పందించాలన్నారు. అతని ఆరోగ్యం పట్ల ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యతని చెప్పారు. కోదండరాం పిల్లల హక్కుల పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. మోతీలాల్ నాయక్ ఏడు రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం దురదృష్టకరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+