రైతుల నోటి కాడి ముద్ద లాగేశారు: కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు నిప్పులు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని.. రైతుబంధు నిధులను రైతులకు అందకుండా కుట్రలు చేసిందని ఆరోపించారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై పరోక్ష విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రారంభం నాటి నుంచి రైతాంగ వ్యతిరేక చర్యలు పాల్పడుతోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నపుడు కూడా కాంగ్రెస్ అదే పరిస్థితి కొనసాగించిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయలేదా? అని ప్రశ్నించారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో రైతుబంధు ఆపేశారని చెప్పారు. తెలంగాణలో కూడా రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ అర్థరాత్రి పూట కరెంట్ ఇచ్చి అరిగోస పెట్టింది. ఎరువులు ఇవ్వకుండా రైతులను బాధ పెట్టింది. 2009లో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. నీళ్ళు ఇవ్వలేదు. సాగు, మంచినీళ్ల కోసం అసెంబ్లీ వద్ద మేము ధర్నా చేస్తే పట్టించుకోలేదు. నాడు అధికారంలో ఉండి రైతులను గోస పెట్టింది. నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా గోస పెడుతున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రైతుబంధు రైతులకు దక్కకూడదన్నదే కాంగ్రెస్ ఆలోచన. అందుకే అక్టోబర్ 23న కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే, రైతుబంధు కొత్త పథకం కాదని, ఇప్పటి వరకు 11 సార్లు ఇచ్చామని, మరోసారి పంపిణీ చేసేందుకు అనుమతివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరితే.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. దీనికి బీఆర్ఎస్, బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని రేవంత్ ఆరోపించారు. పోలింగ్ కు 4 రోజుల ముందు రైతుబంధు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రైతులపై ప్రేమే ఉంటే.. ఈసీ నిర్ణయాన్ని స్వాగతించొచ్చు కదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
ఈసీ అనుమతిని రద్దు చేసుకోవాలంటూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మరోసారి ఎన్నికల సంఘానికి లేఖ రాసిని సంగతి వాస్తవం కాదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుల నోటి దగ్గరి ముద్దను లాక్కున్న పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఈసీని రేవంత్ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారని, ఈసీ అనుమతి రద్దు చేశాక.. రైతులపై రేవంత్ కపట ప్రేమ నటిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు.
అక్టోబర్ 23న మాణిక్ రావు థాక్రే రైతుబంధు వేయొధ్దు అని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. రైతుబంధు ఆపాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీటింగ్ పెట్టి చెప్పారు. రైతుల నోటి కాడి బుక్కను లాగేసిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దొంగే దొంగ అన్నట్టు ఉందన్నారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు నవంబర్ 30న ఎన్నికల్లో బుద్ది చెప్పాలి అని హరీశ్‌రావు సూచించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications