Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ లేఖ బయటపెట్టు: హరీష్ 'బెదిరింపు'పై దేవినేని కౌంటర్

హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం కౌంటర్ ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు వచ్చి ఉంటే వాటిని హరీష్ రావు బయట పెట్టాలన్నారు. ఏ రాష్ట్రమైనా అనుమతులు ఉంటే ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చునని చెప్పారు. కర్నూలు జిల్లా కలెక్టర్ రాసిన లేఖను హరీష్ రావు బయటపెట్టాలన్నారు. జగన్ దీక్ష రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉందన్నారు.

చంద్రబాబు, జగన్‌లపై హరీష్ రావు ఆగ్రహం

ఇబ్రహీంపట్నం చెరువుకు కృష్ణా నీరు తీసుకొస్తామని హరీష్ రావు బుధవారం అన్నారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో రూ.15 కోట్లతో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇబ్రహీంపట్నం చెరువును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.

గత పాలకులు దీనిని పట్టించుకోలేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామన్నారు. అన్ని ప్రాజెక్టులను కడితే కాంగ్రెస్‌ను మరిచిపోతారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు, జగన్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులున్నాయని గుర్తు చేశారు. ఢిల్లీలో చంద్రబాబు, దీక్షల పేరుతో జగన్ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు.

Harish Rao threatens Andhra Pradesh government of non cooperation

అడ్డుకుంటే, మీ ప్రాజెక్టులు నిండనిస్తామా: ఏపీకి హరీష్ హెచ్చరిక

మా ప్రాజెక్టులను అడ్డుకుంటే మీ నష్టమని, కర్నాటకకు రాసిన లేఖ వెనక్కి తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో ఏపీకి సహకరించమని, ఇలా అయితే పులిచింతల ప్రాజెక్టును నిండనిస్తామా అని తెలంగాణ మంత్రి హరీష్ రావు మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు ఐదుసార్లు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. దుష్పరిణామాలకు మీరే బాధ్యులు అని మండిపడ్డారు. కర్ణాటకతో చర్చలు జరిపి, నచ్చజెప్పి, రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) పనులను తాము కొలిక్కి తెస్తే ఏపీ పాలకులు దానికి మోకాలడ్డటం దారుణమన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాను వినియోగించుకోవడంలో అడ్డంకులు సృష్టించి, హక్కును కాలరాస్తే ఊరుకోబోమన్నారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు ముమ్మాటికీ సక్రమమే అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌ పరస్పరం కొట్లాడుకోవడానికి వంద అంశాలున్నాయన్నారు.

Harish Rao threatens Andhra Pradesh government of non cooperation

తెలంగాణ ప్రాజెక్టులను వేదికగా చేసుకోవడం రాక్షసత్వమన్నారు. మహరాష్ట్ర, కర్ణాటకల మాదిరిగా ఏపీ కూడా తెలంగాణకు సహకరించాలని కోరారు. మొండిగా వ్యవహరిస్తే దానికే నష్టమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్‌) పనులు జరుగుతున్నాయన్నారు.

ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నట్లు చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఒక్క ఏడాదీ 20వేల ఎకరాలకు మించి నీరు పారలేదని విమర్శించారు. తాజాగా శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందన్నారు.

Harish Rao threatens Andhra Pradesh government of non cooperation

పనులను ఆపాలని కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీవో ఆర్డీఎస్‌ ఈఈకి, రాయచూర్‌ కలెక్టర్‌కు లేఖ రాశారని చెప్పారు. కర్ణాటక మంత్రితో చర్చించి తాము సమస్యను కొలిక్కి తెస్తే పనులను ఆపాలని ఏపీ సర్కారు ప్రయత్నించడం దుర్మార్గమని మండిపడ్డారు.

Harish Rao threatens Andhra Pradesh government of non cooperation

ఏపీకి మానవతతో సాయం చేస్తున్నా తెలంగాణ హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆర్డీఎస్‌ నిర్ణయంలో చంద్రబాబు, దేవినేని ఉమా భాగస్వాములన్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

పాలమూరు, దిండి పథకాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయం తీసుకున్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. ఉత్తర్వులు ఇచ్చినపుడు, ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకున్న సందర్భంలోనూ అక్రమమని చెప్పలేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+