టిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి జైలుశిక్ష: అనర్హతపై హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: పఠాన్‌చెరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనర్హత వేటు పైన గురువారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. వివరణ ఇవ్వాలని మహిపాల్ రెడ్డికి, ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
మెదక్ జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే జి మహిపాల్ రెడ్డి క్రిమినల్ కేసులో సంగారెడ్డి కోర్టు రెండేళ్ల ఆరు నెలల జైలు విధించినప్పటికీ అనర్హత వేటు వేయకపోవడాన్ని సవాలు చేస్తూ బుధవారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.

జైలుశిక్ష పడిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసి.. ఆ స్థానం ఖాళీఅయినట్లు ప్రకటించేలా ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ మెదక్‌కు చెందిన లాయర్, బిజెపి నేత రఘునందన్ రావు వ్యాజ్యం పేర్కొన్నారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ప్రజాప్రతినిధికి రెండేళ్లకు మించి జైలు శిక్ష పడితే చట్టసభల్లో వారి సభ్యత్వానికి అనర్హత వర్తిస్తుందన్నారు. మహిపాల్ రెడ్డికి కోర్టు జైలు శిక్ష విధించినా ఎమ్మెల్యేగా కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై కోర్టు గురువారం విచారణ చేపట్టింది.గురువారం విచారణ చేపట్టనుంది.












Click it and Unblock the Notifications