ఎన్‌కౌంటర్ కొనసాగింపు: మావోల మృతదేహాలపై హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను తరలించడంలో జాప్యం జరుగుతోంది. శనివారంనాడు మృతదేహాలను తరలిస్తారని అంటున్నారు.
తెలంగాణలోని భద్రాద్రి జిల్లా చర్ల మండలం తొండపాల్ వద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మవోయిస్టులు మరణంచిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పౌర హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. మావోయిస్టుల మృతదేహాలకు వరంగల్‌లోని ఎంజిఎం ఆస్పత్రిలో పోస్టు నిర్వహించాలని పౌర హక్కుల సంఘం కోరింది.

అయితే, భద్రాచలం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీయాలని, ఇద్దరు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించాలని,, బంధువులకు అప్పగించే వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలిచ్చిది. ఈ కేసుపై తదుపరి విచారణను రెండడు వారాలకు వాయిదా వేసింది.
మరణించిన 10 మంది మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఎదురు కాల్పుల్లో సుశీల్ అనే పోలీసు కమండో మరణించాడు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ గాయపడినట్లు తెలుస్తోంది.
మృతుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ జగన్ ఉన్నాడు అతనిపై 30 లక్షల రూపాయల నగదు బహుమతి ఉంది. అతనిపై 50 కేసులు ఉన్నట్లు సమాచారం. హరిభూషణ్ సహచరి సమ్మక్క కూడా మృతుల్లో ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications