HCU: కంచ గచ్చిబౌలి ప్రాంతంలో పోలీసుల ఆంక్షలు

HCU: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో సైబరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. 400 ఎకరాల విస్తీర్ణంపై సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేసుల పెండింగ్ దృష్ట్యా ఇతరుల సంచారంపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ప్రశాంతతకు భంగం కలిగేలా ఎవరూ తిరగవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దురుద్దేశంతో వచ్చే వ్యక్తుల ప్రవేశం పైనా కంచ గచ్చిబౌలి భూముల్లో నిషేధ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆంక్షలను అందరూ విధిగా పాటించాలని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. కాగా, కోర్టుల తీర్పు వచ్చేంతవరకూ ఈ ఆంక్షలు ఉండే అవకాశం ఉంది.

HCU Police restrictions in Kancha Gachibowli area

కాగా,కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెట్ల తొలగింపు పనులు వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అక్కడి భూమిలో చెట్ల సంరక్షణ మినహా అన్నిరకాల కార్యకలాపాలను తక్షణం నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కేవలం మూడు రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లను కొట్టేయడంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. చెట్ల నరికివేతకు అనుమతులు, పర్యావరణ మదింపు పత్రాలు ఉన్నాయా? అంటూ నిలదీసింది. మరోవైపు, కంచ గచ్చిబౌలిలో 400ల ఎకరాల్లో చెట్ల నరికివేత పనులపై దాఖలైన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 7కి వాయిదా వేసింది.

ఈ భూమిని టీజీఐఐసీకి కేటాయిస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్‌ 26న జారీచేసిన జీవో54ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కె.బాబూరావు అనే వ్యక్తి, వట ఫౌండేషన్‌లు వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు(పిల్​) దాఖలు చేశాయి. ఏప్రిల్ 03న భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలంటూ హెచ్‌సీయూకి చెందిన విద్యార్థులతోపాటు మరొకరు తాజాగా మరో 2 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.

వీటన్నింటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌పాల్, జస్టిస్‌ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యాహ్నం విచారణను చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ, అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు కంచ గచ్చిబౌలి 400 ఎకరాల వ్యవహారంపై హైకోర్టు రిజిస్ట్రీ నుంచి నివేదిక కోరిందన్నారు.

Take a Poll

కంచ గచ్చిబౌలి భూములపై మంత్రుల కమిటీ

కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థులు, ప్రజా సంఘాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. కాగా, 1975లో హెచ్‌సీయూకు కంచ గచ్చిబౌలిలో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించారు. కానీ, భూ యాజమాన్య హక్కులు యూనివర్సిటీకి బదిలీ చేయలేదు. రెవెన్యూ, అటవీ రికార్డుల ప్రకారం సర్వే నంబరు 25లో ఉన్న భూమిని ఏనాడూ అటవీ భూమిగా వర్గీకరించకపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+