హాస్టల్లో ఉన్నప్పటి నుంచే!: అక్కడ కూడా 'దుస్తులు విప్పేసి', 'గే' భర్త గురించి మరో నిజం
హైదరాబాద్: హోమో సెక్స్‌కు అలవాటు పడి భార్యను చిత్రహింసలు పెడుతూ వస్తున్న అంకుష్ అనే యువకుడి బండారం బయటపడిన సంగతి తెలిసిందే.
అంకుష్
భార్య
దీపిక
అతని
గుట్టు
రట్టు
చేయగా..
పోలీసుల
విచారణలో
అతను
మరిన్ని
వివరాలు
వెల్లడించినట్లు
తెలుస్తోంది.
బాధితురాలు
సైదాబాద్
పోలీసులను
ఆశ్రయించడంతో..
అంకుష్
పై
కేసు
నమోదు
చేసి
అరెస్ట్
చేశారు.

హాస్టల్లో ఉన్నప్పటి నుంచే:
అంకుష్‌కు హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న సమయం నుంచే దుస్తులు విప్పేసి చూపించే అలవాటు ఉన్నట్లు.. ఆ విషయాన్ని అతనే సైదాబాద్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు బాధితురాలు దీపిక తెలిపారు.
పెళ్లి తర్వాత కూడా అలాగే ప్రవర్తించాడని, ఎప్పుడూ మొబైల్ ఫోన్‌తోనే గడిపేవాడని, దుస్తులు విప్పేసి లైవ్ వీడియో ద్వారా యువకులతో గంటలకొద్ది చాటింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడని ఆమె చెప్పారు. అంకుష్ ఫోన్ కాల్, వీడియా రికార్డుల డేటా సేకరిస్తే అతని అసలు స్వరూపం బయటపడుతుందని దీపిక తెలిపారు.
స్వలింగసంపర్కం
:
లైవ్
వీడియో
చూసి
షాకైన
భార్య,
సంసారానికి
పనికిరాడని
ఫిర్యాదు

నిందితులను విడిచిపెట్టడంపై:
దీపిక భర్త అంకుష్, మామ, మరిదిలను సైదాబాద్ పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్దిసేపటికే వారిని విడిచిపెట్టడంపై అనుమానాలు తలెత్తాయి. దీనిపై బాధిత మహిళ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిందితులను విచారించాల్సిందిపోయి, దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అన్ని కేసుల్లో ఇలాగే నిందితులను వదిలిపెడుతారా? అని నిలదీశారు. మరోవైపు పోలీసులు మాత్రం సుప్రీంకోర్టు గైడ్‌లెన్స్ ప్రకారమే తాము నిందితులను విడిచిపెట్టామని, దర్యాప్తు తర్వాత వారిపై చర్యలు ఉంటాయని అన్నారు.
పక్క
రూమ్‌లో
భార్య,
బెడ్రూమ్లో
నగ్నంగా
భర్త
లైవ్‌లో
కాలక్షేపం,
ఏం
జరిగిందంటే?

ఆమె ప్రొఫెసర్, అతనో కాలేజీ యజమాని:
బాధితురాలు దీపికది హైదరబాద్ లోని సైదాబాద్ మాతృశ్రీ కాలనీ. 2014 మే14న అంకుష్ తో ఆమె వివాహం జరిగింది. హిరాబాద్‌కు చెందిన అరుణ హైస్కూల్, అరుణబాయి డీఈడీ కాలేజీకి అంకుష్ యజమాని. పెళ్లి సమయంలో దీపిక తల్లిదండ్రులు 50 తులాల బంగారు నగలు, రూ.30 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. పెళ్లికి ముందు ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన దీపిక.. పెళ్లి తర్వాత మానుకున్నారు.

ఆ అనుమానం నిజం కాదు, అతను తేడా:
పెళ్లైన నాటి నుంచి అంకుష్ తన భార్యను దూరం పెడుతూనే వచ్చాడు. ఎన్నడూ కనీసం ఆమెను దగ్గరికి రానివ్వలేదు. దీంతో వేరే మహిళతో అతనికి శారీరక సంబంధం ఉండవచ్చని దీపిక భావించింది. కానీ ఆ తర్వాతే అసలు నిజం తెలిసింది. అతని మొబైల్ లో ఉన్న రికార్డింగ్స్ ద్వారా అతనో 'గే' అని గుర్తించింది. కూకట్ పల్లి ప్రగతి నగర్ లోని ఓ అపార్ట్ మెంటులో అతను తన రాసలీలలు కొనసాగిస్తున్నట్లు నిర్దారించారు.