ఆకలి తీర్చడం అభినందనీయం:రాజయ్య(ఫోటోలు)
హైదరాబాద్: జంట నగరాల్లోని సర్కార్ దవాఖానాలకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. రాజయ్య వెల్లడించారు. సోమవారం పెట్లబుర్జులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిని ఆయన సందర్శించారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఆసుపత్రి ఆవరణలో రోగుల సహాయకులకు ఉచిత భోజన వసతి కోసం హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజనామృత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు.
ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. సేవలను మరింత విస్తృతం చేయాలని, వారికి ప్రభుత్వ సాయం తప్పక ఉంటుందని పేర్కొన్నారు. జంటనగరాల్లోని పదకొండు ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేక వసతులు, వైద్య సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఇటీవల రూ. 552 కోట్ల నిధులను కేటాయించిందన్నారు.
ఇక చార్మినార్ ఎమ్మేల్యే సయ్యద్ అహ్మాద్ పాషాఖాద్రీ మాట్లాడుతూ ప్రసూతి ఆసుపత్రిలో పేషంట్ల సహాయకులకు ఉచిత భోజన వసతి కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్ తదితరులు పాల్గొన్నారు.

'ఆకలి తీర్చడం అభినందనీయం'
జంట నగరాల్లోని సర్కార్ దవాఖానాలకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. రాజయ్య వెల్లడించారు. సోమవారం పెట్లబుర్జులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిని ఆయన సందర్శించారు.

'ఆకలి తీర్చడం అభినందనీయం'
ఆసుపత్రి ఆవరణలో రోగుల సహాయకులకు ఉచిత భోజన వసతి కోసం హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజనామృత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు.

'ఆకలి తీర్చడం అభినందనీయం'
ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. సేవలను మరింత విస్తృతం చేయాలని, వారికి ప్రభుత్వ సాయం తప్పక ఉంటుందని పేర్కొన్నారు.

'ఆకలి తీర్చడం అభినందనీయం'
జంటనగరాల్లోని పదకొండు ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేక వసతులు, వైద్య సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఇటీవల రూ. 552 కోట్ల నిధులను కేటాయించిందన్నారు.












Click it and Unblock the Notifications