ఫీవర్ ఆస్పత్రి వార్డుపై పడిన భారీ వృక్షం: పరుగుపెట్టిన రోగులు(పిక్చర్స్)
హైదరాబాద్: నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ఓ వార్డుపై భారీ వృక్షం కూలింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రోగులు, ఆస్పత్రి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం నల్లకుంటలో కురిసిన భారీ వర్షానికి ఆరున్నర గంటల సమయంలో ఆస్పత్రిలోని 8వవార్డులో ఉన్న రేకులపై భారీ చెట్టు కూలింది.
దీంతో పైనుంచి రేకులు భారీ శబ్ధంతో పడకలపై పడ్డాయి. ఈ సమయంలో వార్డులో ఐదుగురు రోగులు ఉన్నారు. రేకులు కూలుతుండటంతో రోగులు అక్కడ్నుంచి పరుగుపెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు.
చెట్టు కూలిన సమయంలో చికిత్స పొందుతున్న సుగుణ అనే మహిళకు సహాయంగా ఉండేందుకు వచ్చిన నాయుడు అనే వ్యక్తి కుడి కాలుకు స్వల్ప గాయమైంది. ఇతర రోగులకు గానీ, ఆ పక్కనే ఉన్న వార్డుల్లోని వారికి గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఫీవర్ ఆస్పత్రి
హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ఓ వార్డుపై భారీ వృక్షం కూలింది.

ఫీవర్ ఆస్పత్రి
ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రోగులు, ఆస్పత్రి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఫీవర్ ఆస్పత్రి
శుక్రవారం సాయంత్రం నల్లకుంటలో కురిసిన భారీ వర్షానికి ఆరున్నర గంటల సమయంలో ఆస్పత్రిలోని 8వవార్డులో ఉన్న రేకులపై భారీ చెట్టు కూలింది. దీంతో పైనుంచి రేకులు భారీ శబ్ధంతో పడకలపై పడ్డాయి.

ఫీవర్ ఆస్పత్రి
ఈ సమయంలో వార్డులో ఐదుగురు రోగులు ఉన్నారు. రేకులు కూలుతుండటంతో రోగులు అక్కడ్నుంచి పరుగుపెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు.

ఫీవర్ ఆస్పత్రి
చెట్టు కూలిన సమయంలో చికిత్స పొందుతున్న సుగుణ అనే మహిళకు సహాయంగా ఉండేందుకు వచ్చిన నాయుడు అనే వ్యక్తి కుడి కాలుకు స్వల్ప గాయమైంది.

ఫీవర్ ఆస్పత్రి
ఇతర రోగులకు గానీ, ఆ పక్కనే ఉన్న వార్డుల్లోని వారికి గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

భారీ వర్షం
నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా మలక్‌పేట రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర వాహనదారుల పాట్లు.












Click it and Unblock the Notifications