మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటివద్ద భారీగా పోలీసులు.. కొల్లాపూర్ లో టెన్షన్.. కారణమిదే!!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. గత కొంత కాలంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో ఇరువురు నేతలు చేసుకున్న సవాళ్లు ప్రతిసవాళ్ల పర్వంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటివద్ద భారీగా మోహరించి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు వర్సెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి

మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు వర్సెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి

అధికార గులాబీ పార్టీకి చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య వర్గ పోరు చిలికి చిలికి గాలివానగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో అప్పటి నుండి ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఇరువర్గాలు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి.

టీఆర్ఎస్ లో అసమ్మతి గళం వినిపిస్తున్న జూపల్లి కృష్ణా రావు

టీఆర్ఎస్ లో అసమ్మతి గళం వినిపిస్తున్న జూపల్లి కృష్ణా రావు

ఈ క్రమంలోనే ఇటీవల మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లాలో పర్యటించి, టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి నేతలతో మాట్లాడారు. ఆ తర్వాత తాజాగా కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారతాను అన్నట్టు సంకేతాలను జూపల్లి కృష్ణారావు ఇచ్చారు. ఇక ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కూడా జూపల్లిని జిల్లా పర్యటన సమయంలో కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు.

స్థానిక ఎమ్మెల్యే, జూపల్లి మధ్య సవాళ్ళ పర్వం.. కొల్లాపూర్ కు చేరిన నేతలతో టెన్షన్

స్థానిక ఎమ్మెల్యే, జూపల్లి మధ్య సవాళ్ళ పర్వం.. కొల్లాపూర్ కు చేరిన నేతలతో టెన్షన్

అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే పై నియోజకవర్గ అభివృద్ధిపై అవినీతిపై ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దీంతో జూపల్లి కృష్ణారావు చేసిన ఛాలెంజ్ నేపథ్యంలో బహిరంగ చర్చకు సిద్ధం అంటూ బీరం హర్షవర్ధన్ రెడ్డి సైతం రెడీ అయ్యారు. ఇరువురు నేతలు కొల్లాపూర్ కు చేరుకోవడంతో, కొల్లాపూర్ లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఇరువురు నేతల మధ్య కొనసాగుతున్న రగడతో అప్రమత్తమైన పోలీసులు చర్చలకు, ర్యాలీలకు అనుమతి లేదని హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కొల్లాపూర్లో భారీగా పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

కొల్లాపూర్లో భారీగా పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

ఆదివారం ఉదయం కొల్లాపూర్ జూపల్లి ఇంటి వద్దకు ఆయన అనుచరులు రావడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూపల్లి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి ఇద్దరు నేతలను అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని సైతం ఇంటికే పరిమితం చేసి పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనా అధికార పార్టీ నేతల మధ్య ఉన్న లుకలుకలు ఇటీవల కాలంలో బయట పడుతుండటం, చాలామంది అసమ్మతి నేతలు పార్టీని వీడి బయటకు వెళుతుండటం గులాబీ పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. ఈ వ్యవహారంలో పార్టీ ఏం చెయ్యబోతుందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+