Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన: రోడ్లు జలమయం, భారీగా ట్రాఫిక్ జామ్

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్ తోపాటు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కాగా, మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, పోచారం, ఘట్‌కేసర్, కూకట్ పల్లి, చందానగర్, సికింద్రాబాద్, తార్నాక, ఎల్బీనగర్, హయత్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది.

కురిసిన కుండపోత వర్షానికి వాహనదారులు తడిసిముద్దయ్యారు. రోడ్లపైకి వరదనీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరంగల్-హైదరాబాద్, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పైకి వరద నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు. వాన దంచికొట్టడంతో జీహెచ్​ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై ఎక్కడా నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు.

heavy rain hyderabad city huge traffic jam

కాగా, ఉప్పల్ మెట్రో స్టేషన్లో వర్షం నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావాడంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా నిజాంపేటలో పిడుగుపాటుతో 12 గొర్రెలు మృతి చెందాయి.

ఓఆర్ఆర్ పరిధి వరకు జీహెచ్ ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు

భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధి వరకు జీహెచ్ ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఆకస్మిక వర్షాలు, వరదలు వచ్చినా.. ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో సచివాలయంలో మంగళవారం సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ ఇంచార్జ్ కమీషనర్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. జీహెచ్ ఎంసీలోని డిజాస్టర్ రెస్పాన్స్ విభాగాన్ని మరింత పటిష్ఠ పరుస్తున్నామని, ఇందుకుగాను విపత్తులను ఎదుర్కోవడానికి అదనపు సిబ్బందిని, తగు యంత్ర పరికరాలను అందచేయనున్నామని వివరించారు.

ఇప్పటికే, జీహెచ్ఎంసీ పరిధిలో 30 డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని.. వీటికి తోడు మరో 15 బృందాలను అదనంగా ఏర్పాటు చేసి వీటి సేవలను ఓఆర్ఆర్ వరకు విస్తరించనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలున్నందున, కెమికల్ ఫైర్ ప్రివెన్షన్ కు ప్రత్యేక శిక్షణతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని శాంతి కుమారి సూచించారు.

కాగా, హైదరాబాద్ నగరంలో 141 సమస్యాత్మక ప్రాంతంలో మున్సిపల్, పోలీస్, విద్యుత్, జలమండలి తదితర సంబంధిత శాఖల సమన్వయంతో పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ పేర్కొన్నారు. హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాలలో కూడా డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న డీఆర్ఎఫ్ బృందాలను పటిష్ట పర్చడం చేయాలని ఆదేశించారు. విపత్తులు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ విభాగంతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+