హైదరాబాద్‌లో భారీ వర్షం: ఈదురు గాలులకు కూలిన 200 ఏళ్ల వృక్షం

హైదరాబాద్: నగరంలో సోమవారం సాయంత్రం కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, షేక్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌​పల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, పంజాగుట్ట, లక్డీకపూల్ సహా పలుప్రాంతాల్లో వర్షం కురిసింది.

జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించటంతో, పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భాగ్యనగరంలోని నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్, ఖైరతాబాద్​లో తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.

Heavy rain in Hyderabad Huge trees fell due to strong winds

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పురా, ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, లంగర్‌హౌస్‌, గండిపేట్‌, శివరాంపల్లి ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మలక్ పేట, చాదర్ ఘాట్, సైదాబాద్, సంతోశ్​ నగర్, చంపాపేట్, సరూర్ నగర్, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లోను జోరు వాన కురుస్తోంది.

కొద్దిపాటి వర్షానికే నీరంతా రోడ్లపైకి వచ్చి చేరడంతో పలుచోట్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది.. ఎక్కడా నీళ్లు నిలిచిపోకుండా, డ్రైనేజ్ పొంగిపొర్లిన చోట ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.

హైదరాబాద్ నగరంలో ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. టోలిచౌక్​ గోల్కొండ ఎండి లైన్స్​‌లోని ఈదురు గాలులతో 200 సంత్సరాల నాటి చెట్టు నేలకొరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తలకు గాయాలు కాగా, 4 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.

హైదరాబాద్‌​లో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ కోరారు. లోతట్టు కాలనీల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మ్యాన్ హోల్స్ వద్ద ప్రమాదం జరగకుండా చూసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్ల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. భారీ వర్షాలు కారణంగా అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దన్నారు. మరోవైపు, ఎలాంటి స‌మ‌స్య‌లున్నా 040-21111111, 9000113667కు ఫోన్ చేయాల‌ని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+