Weather Update: ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..!

తెలంగాణలో రుతుపవనాలు వ్యాపించాయి. దీంతో గురు, శుక్రవారాలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల కాలం మొదలైందని వాతావరణ శాఖ ప్రకటించింది. పులు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఛాన్స్ ఉందని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

రుతుపవన ఆరంభ కాలం కాబట్టి వర్షానికి ముందు, వర్షం కురిసే సమయంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు వస్తాయని తెలిపింది. పలు చోట్ల పిడుగులుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్​, సిద్దిపేట, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్​, హనుమకొండ, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, మెదక్ జిల్లాలో వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

Heavy rain is likely to occur in many districts of Telangana for the next two days

ఈ రెండు రోజులు గాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్ర వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. డిజస్టర్ మేనేజ్మెంట్ టీమ్ లు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+