Rains: ఆ పది జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..!

తెలంగాణలో వర్షాకాలం మొదలై నెల దాటినా సరిగా వర్షాలు లేవు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. హనుమకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

మిగతా జిల్లాల్లోనూ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ​లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణం మబ్బులు పట్టి ఉంటుందని ఉంటుందని.. కాస్త ఉక్కపోత ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. ములుగు, హనుమకొండ, వరంగల్​, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్​, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

Heavy rains are likely to occur in ten districts of Telangana for the next five days according to the Meteorological Department

అత్యధికంగా ఖమ్మం జిల్లా గంగారంలో 62 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాదు.. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 61 మి.మీ, సీతారామపట్నంలో 53 మి.మీ, భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 48 మి.మీ వర్షాపాతం నమోదు అయింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. అటు ఏపీలో కూడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరకోస్తా తీరం మీద ఉన్న ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఆ రాష్ట్ర వాతావరణ శాఖ పేర్కొంది.

ఏలూరు, కర్నూలు, నంద్యాల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందన అంచా వేసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో 8.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కృష్ణా జిల్లా అవనిగడ్డలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+