ములుగుజిల్లాలో వర్షబీభత్సం: గుండ్లవాగు బ్రిడ్జ్ వద్ద కొట్టుకుపోయిన జాతీయ రహదారి;ఏజెన్సీగ్రామాలకు రాకపోకలు బంద్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలలోని పలు జిల్లాలలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ములుగు జిల్లా లక్ష్మీదేవ్ పేట్ వద్ద 533.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లాలో పరిస్థితి దారుణంగా మారింది. ములుగు జిల్లా కేంద్రం వరదలతో అతలాకుతలం అవుతుంది.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి సమీపంలో గుండ్ల వాగుపై 163వ జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జికి సమీపంలో రోడ్డు తెగిపోయింది. రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి గుండ్ల వాగు పొంగి ప్రవహిస్తోంది . దీంతో రోడ్డుకు గండి పడి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వరంగల్ వైపుకు వెళ్లే పరిస్థితి లేదు. ఏ క్షణమైనా రోడ్డు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

heavy rains in Mulugu: national highway broke at Gundlavagu Bridge; roads blocked to agency villages!!

ములుగు జిల్లా కేంద్రంలోని మహర్షి కళాశాల ఎదుట రోడ్డు వరద నీటితో మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇప్పటికే ములుగు జిల్లాలో చాలా ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రేమ్ నగర్ సమీపంలో జాతీయ రహదారి పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బంది నెలకొంది.

ములుగు సమీపంలోని జీవంతరావు పల్లి, పాలసావు పల్లి గ్రామాల్లో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఆ గ్రామాలలో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో నీట మునిగిన ఇళ్లలోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ములుగు మండలం మదనపల్లి చెరువుకట్ట తెగిపోవడంతో చెరువులోని నీరు ఇళ్లల్లోకి చేరుతుంది. వెంకటాపూర్ ప్రాంతంలో శివారులో మారేడు కొండ చెరువుకు నాలుగువైపులా గండ్లు పడడంతో ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ములుగు జిల్లా మంగపేట మండల వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రమణక్కపేట గ్రామంలో పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది. దీంతో వరదలో చిక్కుకున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మేడారం పరిసర ప్రాంతంలో పడిగాపురం గ్రామాన్ని జంపన్న వాగు చుట్టుముట్టింది, దీంతో పడిగాపురం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+