Weather Update: మరో రెండు రోజులు భారీ వర్షాలు..!
తెలంగాణలో ముసురు కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజులుగా ముసురు పడుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోతోంది. భారీ వర్షాలతో చెరువులు మత్తడి పారుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పోతున్నాయి. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతవరణ కేంద్రం కీలక సూచన చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గురువారం ఉదయం వరకు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. గురు, శుక్రవారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ మేరకు ఇప్పటికే ఆ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ ఇచ్చారు. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలతో ప్రాజెక్టుల్లోకి క్రమంగా వరద చేరుతోంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, తాలిపేరు ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద వస్తోంది.
ఇక శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరాంసార్ కు మోస్తరు వరద వస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ కూడా భారీగా వరద నీరు వస్తోంది.












Click it and Unblock the Notifications