హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు: జీహెచ్ఎంసీ అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల వర్షం పడుతోంది. అయితే, ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలి వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భాగ్యనగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.
ఈ నేపథ్యంలో ఏదైనా సమస్యలపై సంప్రదించేందుకు 040 21111111, 9000113667 నెంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. ఆదివారం రాత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి సహా మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంపడుతోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహదేవపూర్ మండలాల్లో వర్షం కురవడంతో ఎన్నికల సామాగ్రిని పంపిణీ ేసేందుకు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుండగా, దక్షిణ, ఆగ్నేయ దిశలలో గాలులు వీస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరోవైపు, ఉమ్మడి మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెద్ద శంకరంపేట మండలంలో పిడుగు పాటుకు తాత, మనవడు ప్రాణాలు కోల్పోయారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కప్పడానికి వెళ్లగా, పిడుగు పాటుతో తాత శ్రీరాములు (50), విశాల్ (11) అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పలు ప్రాంతాల్లో ధాన్యం తడిచింది.
ఈదురు గాలులకు ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. నాగలిగిద్ద మండలం ముక్తాపూర్‌లో 5.1 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. మొగుడంపల్లిలో 2.6 సెం.మీ, పాపన్నపేట మండలం లింగాయిపల్లిలో 1.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో పిడుగు పాటు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి.
ఆసిఫాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఎన్నికల సామగ్రి నిల్వ ఉంటే కేంద్రంలో ఈదురు గాలులకు టెంట్లు కూలాయి. ఎన్నికల సామగ్రి కేంద్రం వరండాలో ఎన్నికల సిబ్బంది తలదాచుకున్నారు. భారీ వర్షంతో పలు కేంద్రాలకు వెళ్లేందుకు పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
బంగాళాఖాతంపై మరింత విస్తరించిన ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications