48 గంటల అలర్ట్: జీహెచ్ఎంసీ పరిధిలో 2 రోజుల సెలవులు, సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు, ఎల్లుండి (శుక్ర, శనివారాలు) రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అదే సందర్భంలో ప్రయివేట్ సంస్థలు కూడా వారి వారి కార్యాలయాలకు సెలువులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖ ను సీఎం ఆదేశించారు. కాగా, మరో రెండు మూడు రోజులుభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు గురు, శుక్రవారాల్లో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భధ్రాచలం వద్ద గోదావరీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సీఎస్ శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని సీఎం ఆదేశించారు. భధ్రాచలంలో ముంపుకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా వుండాలన్నారు.
గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్నదురిశెట్టి అనుదీప్ ను తక్షణమే బయలుదేరి భధ్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా వుండాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంతో పాటు, కలక్టరేట్ లో, ఎమ్మార్వో కార్యాలయాల్లో, కంట్రోల్ రూంలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
Water logging near Yashoda hospital Malakaper after heavy rain in Hyderabad on Thursday. GHMC, DRF teams were on the job of clearing rain water. @balaji25_t @arvindkumar_ias @GHMCOnline @GadwalvijayaTRS @CommissionrGHMC @Hyderabadrains pic.twitter.com/kClkop0xLe
— R V K Rao_TNIE (@RVKRao2) July 20, 2023
సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్లను ఎన్డీఆర్ ఎఫ్ దళాలను అందుబాటులో వుంచాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలమేరకు కంట్రోల్ రూం సహా హెలీకాప్టర్లు సంబంధిత సహాయకచర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను చేసిన అధికారయంత్రాంగం, భధ్రాచలంలో సహాయక చర్యలకు సిద్ధంగా వుంది.
రెవిన్యూ, పంచాయితీ రాజ్, వైద్యారోగ్యశాఖ, డిసాస్టర్ మేనేజ్మెంట్, సహా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా వుండాలని, ఇందుకు సంబంధించి సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు.
ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
48 గంటల అలర్ట్
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న 48గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అన్నిశాఖ అధికారులతో పాటు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. వరంగల్, ములుగు, కొత్తగూడెంలో ఎన్‌డీఆర్‌ఎప్ బృందాలు సిద్ధంగా ఉన్నామన్నారు.
హైదరాబాద్‌లోనూ 40 మంది సిబ్బందితో బృందం సిద్ధంగా ఉందన్నారు. గేట్రర్ 426 హైదరాబాద్‌లో మాన్‌సూర్ ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అలాగే 157 స్టాటిక్ టీమ్‌లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. నీటి నిల్వ ఉండే 339 ప్రాంతాల వద్ద ప్రత్యేక సిబ్బందిని మోహరించామని, ఇప్పటి వరకు చెరువులు, కుంటలకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అన్ని మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications