Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గోదావరికి వరద ముప్పు: ఏపీలో ఆరు జిల్లాల్లో హైఅలర్ట్

Godavari floods 2024: కనివినీ ఎరుగని విధంగా సంభవించిన విపత్తు.. రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురి చేసింది. అతి భారీ వర్షాల వల్ల ఏపీ, తెలంగాణ దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.

ప్రత్యేకించి- రాజధాని అమరావతి మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.

High alert as River Godavari on the rise with flood water

అదే తరహా పరిస్థితులు తెలంగాణలోనూ ఏర్పడ్డాయి. ప్రత్యేకించి- ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట్ జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. విజయవాడలో బుడమేరు తరహాలోనే ఖమ్మంలో మున్నేరు వాగు పొంగిపొర్లింది. ఈ నగరాన్ని ముంచెత్తింది. మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయం అయ్యాయి.

ఇప్పుడు ఇదే తరహా పరిస్థితులు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో సంభవించే ప్రమాదం లేకపోలేదు. కొన్ని గంటలుగా గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ పోతోండటమే ఈ ఆందోళనకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది.

మహారాష్ట్ర ఎగువ పరివాహక ప్రాంతాలు, ఉపనదుల్లో కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాల వల్ల గోదావరి నది నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద జలాలు దీనికి తోడయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌ సహా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంటోంది.

దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. తెలంగాణలోని భద్రాచలం, ఏపీలోని ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారి 163 మీదుగా గోదావరి నీరు ప్రవహించడంతో దీని తీవ్రతకు అద్దం పడుతోంది.

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లోలో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. మంగళవారం సాయంత్రానికి 2.3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 80 టీఎంసీలకు చేరుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 4.78 లక్షల క్యూసెక్కులు ఉంటోంది. దీనితో 5.3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదుల నుంచి వరద ప్రవాహం కారణంగా సమ్మక్క సాగర్‌కు 7.68 లక్షల క్యూసెక్కులకు వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు, కిన్నెరసాని, శబరి వంటి ఉపనదుల వరద ప్రవాహం అధికంగా ఉండటం వల్ల గోదావరి క్రమంగా ఉప్పొంగుతోంది.

గోదావరికి స్వల్పంగా పెరిగిందని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 42.2 అడుగుల నీటి మట్టం నమోదైందని పేర్కొంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 3,05,043 కాగా.. అవుట్ ఫ్లో 3,12,057 లక్షల క్యూసెక్కుల వరకు ఉంటోంది. దీనితో ఆరు జిల్లాల అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+