డ్రగ్ కేసులో రేవంత్ రెడ్డి పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో టిడిపి నేత రేవంత్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం స్వీకరించింది. దర్యాఫ్తు సంస్థల పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సిట్‌ దర్యాప్తు సంతృప్తికరంగా లేదని రేవంత్‌ రెడ్డి తరఫు న్యాయవాది రచనా రెడ్డి వాదించారు.

సిట్‌కు నియంత్రించేందుకు అధికారం ఉంది కానీ నిందితులను అరెస్టు చేసే అధికారం లేదని వాదించారు. ఎక్సైజ్‌శాఖకు డ్రగ్స్ నియంత్రించే అధికారం ఉన్నా నిందితుల్ని ప్రాసిక్యూషన్‌ చేయలేదని, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో విచారణ చేపట్టలేదన్నారు. సిట్‌కు ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ అధికారాలు ఉన్నాయా లేవా వారంలో చెప్పాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.

High Court agrees to take up Revanth Reddy's petition

ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం ఎక్సైజ్‌ శాఖకు దర్యాప్తుచేసే అధికారం ఉందని ప్రభుత్వ న్యాయవాది శరత్‌ న్యాయస్థానానికి తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం ఏ చట్టం ప్రకారం, ఎంతవరకు విచారించే అధికారం సిట్‌కు ఉందో వారంలోగా తెలపాలని ఎక్సైజ్‌శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court on Tuesday agreed to take up Telangana Telugu Desam working president Revanth Reddy's petition on drug issue.
Please Wait while comments are loading...