బీజేపీ తలపెట్టిన ధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి: పోలీసులకు ప్రశ్నలు
హైదరాబాద్: అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జులై 25న తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నాకు హైకోర్టు అనుమతిచ్చింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలంటూ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అయితే, జులై 14, 20న ధర్నాకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసినప్పటికీ.. పోలీసులు అనుమతి ఇవ్వలేదని బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీ ప్రదీప్ కుమార్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ధర్నా చౌక్ వద్ద ధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని.. 1000 మంది ధర్నాలో పాల్గొంటే ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, అధికార పార్టీ కూడా ధర్నాలు చేసిన సందర్భాలున్నాయని.. అలాంటప్పుడు మాత్రం అభ్యంతరాలు ఎందుకు రావని హైకోర్టు నిలదీసింది.
ఇక ధర్నాలో 500 మందికి మించి పాల్గొనరాదని.. ఈ మేరకు పోలీసులకు లిఖితపూర్వక హామి ఇవ్వాలని బీజేపీకి హైకోర్టు సూచించింది. ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని, ధర్నాకు హాజరయ్యే ముఖ్య నేతల వివరాలు పోలీసులకు ముందుగానే సమర్పించాలని ఆదేశించింది. బీజేపీ ర్యాలీకి అనుమతివ్వాలంటూ హైదరాబాద్ సీపీని ఆదేశించింది.
మరోవైపు, నిజామాబాద్ ధర్నాచౌక్‌లో బీజేపీ నేతలు ప్రభుత్వానికి వ్యతరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో నిర్మించిన డబుల బెడ్రూం ఇళ్లు పేదలకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉంటే డబుల్ బెడ్రూం ఇళ్లు రావని విమర్శించారు. పేదల కోసం కట్టిన ఇండ్లు.. పంపిణీ చేయకుండానే కూలిపోతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇళ్లకు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం బడ్జెట్‌లోని నిధుల్లో రూ.10,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఎంపీ అరవింద్ ఆరోపించారు.
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications