గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఎఫెక్ట్: చంద్రబాబు ప్రభుత్వానికి నోటీసులు
బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని తారాగణంగా, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడంపై హైకోర్టు మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వానికి,
హైదరాబాద్: బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని తారాగణంగా, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడంపై హైకోర్టు మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వానికి, చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
దారుణం.. అందుకే గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక చిత్రమని ప్రచారం: చిరంజీవి
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలలో వినోదపు పన్ను మినహాయించారు. తొలుత తెలంగాణలో, ఆ తర్వాత ఏపీలో పన్ను మినహాయించారు.

2015లో వచ్చిన రుద్రమదేవి చిత్రానికి తెలంగాణలో అప్పుడు పన్ను మినహాయించారు. ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణికి కూడా మినహాయించారు. అయితే, ఏపీ మాత్రం రుద్రమదేవికి పన్ను మినహాయించలేదు. గౌతమీపుత్రకు మాత్రం ఇచ్చింది. దీనిపై విమర్శలు వచ్చాయి.












Click it and Unblock the Notifications