మీకు అంత తొందరెందుకు: కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి గురువారం నాడు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వం నియమించిన వీసీల నియామకాన్ని హైకోర్టు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కేసు విచారణ జరుగుతుండగానే వీసీలను నియమించడంపై కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు రెండు రోజుల క్రితం ప్రశ్నించింది. రెండేళ్ల పాటు ఆగారు, మరో రెండు రోజులు ఆగలేకపోయారా అని ప్రశ్నించింది. గురువారం వీసీల నియామకాన్ని రద్దు చేసిన కోర్టు, తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీలకు ప్రభుత్వం రెండు రోజుల క్రితం వీసీలను నియమించింది. సోమవారం ఒకే రోజు ఎనిమిది విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్స్‌లర్లను నియమించింది. ఈ మేర కు వేర్వేరు జీవోలను విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేశారు. అనంతరం ఎనిమిది మంది వైస్‌చాన్స్‌లర్లు పదవీబాధ్యతలు స్వీకరించారు.

ఉప కులపతులు

ఉప కులపతులు

ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతిగా ప్రొఫెసర్ ఎస్ రామచంద్రంను నియమించారు. ఆయన ప్రస్తుతం ఉస్మానియాలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ నియమితులయ్యారు. గతంలో ఆయన ఓయూలో తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు.

ఉప కులపతులు

ఉప కులపతులు

తెలంగాణ యూనివర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ పీ సాంబయ్యను నియమించారు. ఆయన కాకతీయ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందారు.

హైకోర్టు

హైకోర్టు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ కే సీతారామారావును నియమించారు. ఆయన కాకతీయ వర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందారు. జేఎన్‌టీయూహెచ్ వీసీగా ప్రొఫెసర్ ఏ వేణుగోపాల్‌రెడ్డిని నియమించారు. ఆయన ఓయూలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందారు.

కేసీఆర్

కేసీఆర్

కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఆర్ సాయన్నను నియమించారు. ఆయన ఓయూలో ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించి, పదవీ విరమణ పొందారు. పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ బీ రాజారత్నం నియమితులయ్యారు. ఆయన ఓయూలో కామర్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేశారు.

కేసీఆర్

కేసీఆర్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా డాక్టర్ వెల్చాల ప్రవీణ్ రావును నియమించారు. ప్రస్తుతం ఆయన అదే వర్సిటీకి స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నారు. వీసీల నియామకాలపై హైకోర్టులో ఉన్న కేసు తుది తీర్పునకు లోబడి ఈ నియామకాలు చేపట్టినట్టు జీవోల్లో తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court shocks Telangana government over varsity VCs'.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి