నల్గొండ జిల్లాలో హిజ్రాల ఔదార్యం: గర్భిణీకి రైల్లో పురుడు పోశారు
హైదరాబాద్: హిజ్రాలను చూడగానే చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు. వేరే దారిలేక బతకడం కోసం బలవంతంగా డబ్బులు వసూలు చేయడాన్ని అందరూ వ్యతిరేకిస్తుంటారు. రైళ్లలో వీళ్ల దందాకు అడ్డేలేదు. కానీ వాళ్లకూ మానవత్వం ఉందని చాటారు. రైలులో పురిటినొప్పులతో ఆపసోపాలు పడుతున్న మహిళకు పురుడు పోశారు.
సాటి మహిళలే ముందుకురాని పరిస్థితిలో హిజ్రాలే అన్నీ తానై ప్రసవ ప్రక్రియను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మాయ, చోటు దంపతులు బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా భోపాల్‌కు వెళ్తున్న గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నారు.

రైలు రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ ప్రాంతంలోకి రాగానే మాయకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులకు ఎటూ పాలు పోవడం లేదు. ఇంతలో ఇదే బోగీలోకి ప్రవేశించిన వరంగల్‌కు చెందిన హిజ్రాలైన నిహారిక, జాస్మి న్, లూసియాలు పురిటి నొప్పులతో బాధపడుతున్న మాయను చూశారు.
వెంటనే ఆమెను అదే బోగీలోని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి ప్రసవం జరిపారు. మాయ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రైలు డ్రైవర్‌కు కొందరు చెప్పగా, రైలును ఆలేరులో నిలిపివేశారు. అప్పటికే 108 వాహనానికి సమాచారం అందించగా, వారు స్టేషన్‌కు వచ్చారు. తల్లీబిడ్డలను ఆలేరులోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

సరైన సమయానికి పురుడు పోయడంతో తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆడబిడ్డకు దుస్తులు, తల్లికి మందులు అందజేసి హిజ్రాలు వెళ్లిపోయారు. హిజ్రాలను వైద్యులతోపాటు మాయ కుటుంబ సభ్యులు, తోటి ప్రయాణికులు అభినందించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications