తెల్లారేసరికి కుప్పలు కుప్పలు కండోమ్స్: 'రెడ్ లైట్'లా మారుస్తున్నారని ఫిర్యాదులు..

హైదరాబాద్: అర్థరాత్రి దాటితే చాలు.. ఆ రోడ్డు వైపు వెళ్లడానికే చాలామంది జంకుతున్నారు. ఆ చప్పట్లు వినిపిస్తే చాలు భయంతో పరుగులు పెడుతున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.5లో హిజ్రాల ఆగడాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు వాపోతున్నారు.

 రాత్రి 10గం.కు

రాత్రి 10గం.కు

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డు నం.5ను హిజ్రాలు తమ అడ్డాగా మలుచుకున్నారు. రాత్రి 10గం. అయిందంటే చాలు ఎక్కడెక్కడి హిజ్రాలంతా అక్కడికి చేరుకుంటారు. కృష్ణానగర్‌ గ్రీన్‌ బావర్చి రోడ్డు-జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మధ్యలో ఉన్న ఆ ప్రాంతంలో అర్థరాత్రి వాళ్లంతా వీరంగం చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

 అసభ్యంగా ప్రవర్తిస్తూ..

అసభ్యంగా ప్రవర్తిస్తూ..

రోడ్డుపై వెళ్లే వాహనాలను ఆపి మరీ వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, మహిళలను కూడా వదిలిపెట్టడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గట్టిగా ప్రతిఘటిస్తే.. శరీరంపై దుస్తులు కూడా తీసేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటంతో అటువైపు వెళ్లడానికే వాహనదారులు జంకుతున్నారని అంటున్నారు.

రెడ్ లైట్ ఏరియా తరహాలో..

రెడ్ లైట్ ఏరియా తరహాలో..

స్థానికులు ఎవరైనా హిజ్రాలను ప్రశ్నిస్తే.. రాళ్లతో ఇళ్లపై దాడి చేస్తున్నారని అంటున్నారు. ఇంటి ముందు మూత్ర విసర్జన చేయడం, బండబూతులు తిట్టడం చేస్తున్నారని వాపోతున్నారు. ఇది హిజ్రాల అడ్డాగా మారడంతో కొంతమంది బ్యాచిలర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారని, దాంతో ఇదో రెడ్ లైట్ ఏరియాను తలపించేలా మారిందని అంటున్నారు.

 తెల్లారేసరికి కుప్పలు కుప్పలుగా కండోమ్స్

తెల్లారేసరికి కుప్పలు కుప్పలుగా కండోమ్స్

హిజ్రాల ఆగడాలు భరించలేక కొంతమంది ఇళ్లు కూడా ఖాళీ చేసి వెళ్తున్నారు. పోలీసులు వచ్చినప్పుడు మాత్రమే సైలెంట్ గా ఉండే హిజ్రాలు.. ఆ తర్వాత మళ్లీ రెచ్చిపోతున్నారని అంటున్నారు. పోలీసులు సైతం వారిపై నిఘా పెట్టడం లేదని, తెల్లారేసరికి కుప్పలు కుప్పలుగా కండోమ్స్, వాటర్ బాటిల్స్ దర్శనమిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+