ఆ పరిస్థితి చూసి కన్నీళ్లొచ్చాయి: హిమాన్షురావు తొలి పబ్లిక్ స్పీచ్ సూపర్, తాత, తండ్రి తరహాలో
హైదరాబాద్: గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను తాను ఎప్పుడూ చూడలేదని.. మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు తనకు కన్నీళ్లొచ్చాయన్నారు సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు. తాను సేకరించిన నిధులతో పాఠశాలలో చేపట్టిన ఆధునీకరణ పనులను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హిమాన్షురావు బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హిమాన్షు మాట్లాడుతూ.. ఇది తనకు మొదటి పబ్లిక్ స్పీచ్ అన్నారు. కొత్తవారితో మాట్లాడుతున్నట్లు లేదని.. తన కుటుంబం ముందు మాట్లాడుతున్నట్లు ఉందన్నారు. దాదాపు ఏడాది నుంచి వచ్చి పని ఎలా జరుగుతుందో చూసి వెళ్లేవాడినని చెప్పారు. కేసీఆర్ మనవడిని కదా.. ఏదైనా సాధారణంగా చేసే అలవాటు లేదు.. గొప్పగా చేయాలన్నదే తన ఆలోచన అని అన్నారు.

నిధులు సేకరించి పేదలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలనుకున్నామన్నారు. తమ స్కూల్ ప్రొగ్రాంలో భాగంగా ఈ స్కూల్‌కి గోడలు కట్టించాలి అన్నారని తెలిపారు. మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయని చెప్పారు. ఆడ పిల్లలకు సరైన బాత్రూంలు లేవని.. మెట్లు కూడా సరిగా లేవని చెప్పారు. అలాంటి పరిస్థితులు తానెప్పుడూ చూడలేదన్నారు. ఆ బాధను తానెప్పుడు మాటల్లో చెప్పలేనని హిమాన్షు అన్నారు.

అప్పుడే.. స్కూల్‌కి గోడలు కాదు..చాలా చేయాలని నిర్ణయించుకున్నట్లు హిమాన్షు తెలిపారు. రెండు పెద్ద ఈవెంట్లు చేసి రూ. 40 లక్షలు సేకరించామన్నారు. ఆ తర్వాత సీఎస్ఆర్ కింద మధుసూదన్ సహాయం చేశారని తెలిపారు. ఈ స్కూల్‌కి మంచి చేయడానికి తనకు తన తాత కేసీఆరే స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు.
Renovated this govt primary school with the funds I raised in my school as the CAS president.
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 9, 2023
It is going to be inaugurated by our Hon’ble Education Minister @SabithaindraTRS Garu on the 12th of July🥰🥰
Would love to share the story behind this project soon! pic.twitter.com/sylJE3dUx0
చదువుకున్న సమాజంలో పేదరికాన్ని అరికట్టే ఉపాయం ఉంటుందన్నారు. అందుకే స్కూల్‌కి సాయం చేశానన్నారు. తన గ్రేడ్ చదువులో తగ్గినా.. వందమందికి సహాయం చేసే అవకాశం ఉంటే చేయాలని తన తండ్రి కేటీఆర్ చెప్పారన్నారు. తన కుటుంబం, స్నేహితుల వల్లే ఇది సాధ్యమైందని హిమాన్షు తెలిపారు. హిమాన్షు ప్రసంగానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో హిమాన్షు సరదాగా గడిపారు.
-
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
తెలంగాణా విద్యార్థులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్న భోజనంలో చేపలు! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications