దావోస్ పెట్టుబడులు చూసి కడుపుమంటా..?- ఈనో ఆన్
CM Revanth Reddy visits Davos: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన దావోస్ పర్యటన.. అద్భుత ఫలితాలను ఇచ్చింది. విస్తృతంగా భారీ పెట్టుబడులను సాధించింది. పలు కీలక రంగాల్లో ఆయా సంస్థలతో ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వాటి విలువ 1,78,950 కోట్ల రూపాయలు.
అమెజాన్- రూ. 60,000 కోట్లు, సన్ పెట్రోకెమికల్స్- రూ. 45,500 కోట్లు, టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్- రూ. 15,000 కోట్లు, మేఘా ఇంజినీరింగ్- రూ. 15,000 కోట్లు కంట్రోల్ ఎస్, సైఫీ, ఉర్సా క్లస్టర్స్, బ్లాక్ స్టోన్, హెచ్‌సీఎల్ టెక్ సెంటర్, విప్రో, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యూనిలివర్ వంటివి సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూలను కుదుర్చకున్నాయి.

ఐటీ, డేటా సెంటర్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, సోలార్, రాకెట్ తయారీ, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్స్ డిజైన్, యూఏవీ తయారీ, పామాయిల్ రిఫైనరీ యూనిట్‌కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయి ఇందులో. అవన్నీ కార్యరూపం దాల్చితే హైదరాబాద్ అతిపెద్ద హబ్‌గా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
ఈ దావోస్ పర్యటన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అతిపెద్ బూస్ట్ ఇచ్చినట్టయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండో సంవత్సరంలోనే ఈ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం పట్ల ముఖ్యమంత్రి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నట్టయింది. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణే 1.78 లక్షల కోట్లు రూపాయల విలువ చేసే పెట్టుబడులు, 49,500 ఉద్యోగాలను సాధించినట్టయింది.
ఇది- అటు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అయింది. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుకుంటే మహారాష్ట్ర తరువాత ఈ స్థాయిలో పెట్టుబడులను సాధించడాన్ని వినియోగించుకుంటోంది. దావోస్ పెట్టుబడులు ఇచ్చిన ఊపుతో ప్రత్యర్థులపై రాజకీయంగా దాడి మొదలు పెట్టింది కాంగ్రెస్. భారత్ రాష్ట్ర సమితిపై వినూత్నంగా వార్‌కు దిగింది కాంగ్రెస్ పార్టీ.
ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై సెటైరికల్ ఫ్లెక్సీలు, హోర్డింగులు హైదరాబాద్‌లో విస్తృతంగా వెలిశాయి. పెట్టబడులు చూసి కడుపు మంటా..? వాడండి ఈనో.., ఈనో ఆన్ కడుపుమంట గాన్.. అంటూ కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను వాటిపై ముద్రించి ఉన్నాయి.












Click it and Unblock the Notifications