వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈటెల సభపై తేనెటీగల దాడి: మహిళలకు గాయాలు

|
Google Oneindia TeluguNews

కరీంనగర్/హైదరాబాద్: జిల్లాలోని హుజురాబాద్ మండలం కెసి క్యాంప్ వద్ద విద్యుత్ ఉప కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సభ జరుగుతుండగా ఒక్కసారిగా సభా స్థలంలో దాడికి పాల్పడ్డాయి.

దీంతో సభకు హాజరైన పలువురు మహిళలు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది తక్షణం స్పందించి మంత్రి ఈటెలను, కలెక్టర్ వీరబ్రహ్మయ్యను ప్రత్యేక వాహనంలో సంఘటన స్థలం నుంచి క్షేమంగా తరలించారు.

నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో హరీశ్ రావు సమీక్ష

Honey bees attacked on Etela's meeting

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులతో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఖరీఫ్ నాటికి 6లక్షల ఎకరాలకు అదనంగా నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఆ మేరకు భూసేకరణ సహా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో మార్పులతో బిల్లు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

దీపావళి తర్వాతే టిఆర్ఎస్ ప్లీనరీ

అక్టోబర్ 18, 19న హైదరాబాద్‌లో జరగాల్సిన ప్లీనరీని వాయిదా వేసే యోచనలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సిఎం కె చంద్రశేఖర్ రావు ఉన్నట్లు సమాచారం. దీపావళి, బడ్జెట్ సమావేశాల అనంతరం ప్లీనరీ ఏర్పాటు చేసే యోచనలో కెసిఆర్ ఉన్నట్లు తెలిసింది.

English summary
Honey bees attacked on Telangana Minister Etela Rajender's meeting on Tuesday at Huzurabad, Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X