పరువు హత్య కాదు, వివాహితతో అక్రమ బంధమే: పెట్రోల్ పోసి తగలబెట్టారు, ఆ కారే పట్టించింది

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో యువకుడి హత్య కలకలం రేపింది. మొదట పరువు హత్యగా ప్రచారం జరిగినా.. దీనికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. కాగా, నిందితులు తాము వినియోగించిన కారును సర్వీస్ సెంటర్లో ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

కారులో రక్తపు మరకలు ఉండటంతో సర్వీస్ సెంటర్ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

 స్నేహితులతో వెళ్తున్నానంటూ..

స్నేహితులతో వెళ్తున్నానంటూ..

కాగా, మదన్‌పల్లి సమీపంలో హత్యకు గురై దుండగులు కాల్చేసిన వ్యక్తిని హైదరాబాద్‌లోని జుమ్మరాత్‌బజార్‌ నివాసి పురోహిత్ మహేష్‌గౌడ్‌(21)గా పోలీసులు గుర్తించారు. ఇతడు బేగంబజార్‌లోని ఓ కిరాణా దుకాణంలో పని చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి కడ్తాల్‌ వెళ్లున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

  నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమికుడు ! మామూలుగా కాదు, ఘోరం !
  ఇంటి పక్కనుండేవారే హంతకులు

  ఇంటి పక్కనుండేవారే హంతకులు

  మహేష్‌గౌడ్‌ను నగరం నుంచి కారులో తీసుకొచ్చిన నిందితులు హత్య చేసి ఇక్కడ తగులబెట్టినట్లు తెలుస్తోంది. మహేష్‌గౌడ్‌ను తన ఇంటి పక్కనే ఉండే స్నేహితుడితో పాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు సమాచారం. మహేష్‌గౌడ్‌ను కారులోనే కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది.

  పరువు హత్య కాదు.. అక్రమ సంబంధమే కారణం

  పరువు హత్య కాదు.. అక్రమ సంబంధమే కారణం

  మహేష్‌ది మొదట పరువు హత్యగా భావించినప్పటికీ పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది. ఘటనపై డీసీపీ అశోక్ మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న ఓ వివాహిత మహిళతో రమేష్(మహేష్‌ను హత్య చేసిన ప్రధాన నిందితుడు) అనే యువకుడు అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే, ఆ మహిళతో మహేష్ చనువుగా ఉండటంతో రమేష్‌కు నచ్చలేదు. దీంతో మహేష్‌ను పలుమార్లు హెచ్చరించిన రమేష్, అతనితో గొడవపడ్డాడు.

  ఒకే వివాహితో ఇద్దరు

  ఒకే వివాహితో ఇద్దరు

  ఆ తర్వాత ఈ వివాహేతర సంబంధం విషయం తెలియడంతో సదరు మహిళ భర్త తన కాపురాన్ని వేరే చోటికి మార్చాడు. ఈ నేపథ్యంలో కొంత కాలంపాటు మహేష్.. రమేష్ కలుసుకోలేదు. మహేష్‌పై కోపం పెంచుకున్న రమేష్.. కొద్ది రోజులుగా స్నేహంగా నటిస్తూ అప్పుడప్పుడు కలిసేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం మహేష్‌ను పార్టీ అంటూ మహేష్ తీసుకెళ్లాడు. వీరిద్దరికి తెలిసిన నరేష్, శివ అనే మరో ఇద్దరు స్నేహితులు కూడా వచ్చారు. నరేష్ కారులో వీరంతా నగర శివారులో మద్యం సేవించారు. ఆ తర్వాత కారులో వస్తుండగా, పడుకుని ఉన్న మహేష్‌ను వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపాడు రమేష్. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన నరేశ్, శివ.. ఆ తర్వాత మహేష్‌కు సహకరించారు. సమీపంలోని పెట్రోలు బంకులో 10లీటర్ల పెట్రోల్ కొని.. రోడ్డుకు సమీపంలో మహేష్ మృతదేహాన్ని కాల్చేశారు.

  నిందితులను పట్టించిన కారు

  నిందితులను పట్టించిన కారు

  ఆ తర్వాత కారులో రక్తపు మరకలు ఉండటంతో శంషాబాద్‌లోని ఓ కారు వాషింగ్ సెంటర్‌కు వచ్చారు నిందితులు. కారులో రక్తపు మరకలు చూసిన అక్కడ పనిచేసేవారు యజమానికి సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారని, నిందితులు ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి రప్పించి అదుపులోకి తీసుకున్నామని డీసీపీ తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A youth allegedly murdered in old city hyderabad due to love affair with accused's sister.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి