హైదరాబాద్‌లో అర్ధరాత్రి 1 గంట వరకు హోటళ్లు, టీ స్టాల్స్ ఓపెన్

హైదరాబాద్ నగరంలో రాత్రి సమయంలో హోటల్స్ తెరిచి ఉంచే సమయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. అర్థరాత్రి 1 గంట వరకు హోటల్స్ ఓపెన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. మద్యం షాపులు మినహా హోటల్స్, టీ స్టాల్స్ అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచి ఉండేలా ఆదేశాలు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు.

ఈ మేరకు హైదరాబాద్ నగరం పరిధిలోని మూడు కమిషనరేట్లకు ఆదేశాలు ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ కల్చర్‌లో అర్ధరాత్రి వరకు ఛాయ్ తాగడం, బిర్యానీ తినడం అలవాటు అని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో నగరవాసులకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటల్స్‌లో ఆహార పదార్థాలు, ఛాయ్ అందుబాటులో ఉండనున్నాయి.

Hotels and tea stalls to be open till 1 am in Hyderabad

అర్థరాత్రి 1 గంట వరకు మద్యం షాపులు తప్ప మిగతా హోటల్స్ నడిపించుకోవచ్చు. వైన్ షాపులకు ఈ అవకాశం ఇస్తే విచ్చలవిడిగా తాగే అవకాశం ఉంది. అందుకే దాన్ని మినహాయిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటలకే రెస్టారెంట్లు, హోటళ్లను పోలీసులు మూసివేస్తున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్.. తాజాగా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

తెలంగాణకు టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు: సీఎం రేవంత్

తెలంగాణ భవిష్యత్తు ప్రభుత్వ టీచర్ల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రభుత్వం సంకల్పం తీసుకుందని, విద్యా వ్యవస్థలో మార్పు అనే యజ్ఞానికి ఉపాధ్యాయులంతా సహకరిస్తారనే విశ్వాసం తనకు ఉందని సీఎం చెప్పారు. తెలంగాణకు ఉపాధ్యాయులే బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు.

దశాబ్దాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా టీచర్లతో ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ప్రజాప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఈ ఏడాది మొత్తం బడ్జెట్ లో 7.3 శాతం, అంటే సుమారు 21 వేల కోట్ల రూపాయలను విద్యా శాఖకు కేటాయించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

ప్రభుత్వ రంగంలో 30వేల స్కూళ్లకుగానూ 26 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేటు రంగంలో మాత్రం 10వేల స్కూళ్లలోనే ఏకంగా 33 లక్షల మంది విద్యార్థులు ఉండటంపై ఉపాధ్యాయులు ఆలోచన చేయాలని, లోపాలను సరిదిద్దుకుంటూ ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసుకునే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని, అందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.

రైతులు, పేద కుటుంబాలకు ఇస్తున్నట్లే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంటు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే స్కూళ్లలో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను కూడా మహిళా సంఘాలకు అప్పగించి, ఏటా రూ.79కోట్ల నిధులను కూడా కేటాయించినట్లు గుర్తుచేశారు.

తులసివనం లాంటి తెలంగాణలో గంజాయి మెక్కలను పీకేసే పని పాఠశాలల్లోనూ జరగాలని టీచర్లకు ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థులు పక్కదారులు పట్టకుండా చదువులతోపాటు స్పోర్ట్స్ యాక్టివిటీలను పెంచేలా ప్రణాళికలు రూపొందించామని, నైపుణ్యం పెంచడానికి స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటుచేస్తున్నామని సీఎం తెలిపారు. గవర్నమెంట్ బడికి పోవడానికి గర్వపడేలా పరిస్థితులను తీసుకురావాలని టీచర్లకు ముఖ్యమంత్రి నిర్దేశం చేశారు. టీచర్లతో ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారులు, అధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+