ఎగిరి గంతేసే వార్త.. వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పిన తెలంగాణా మంత్రి

తెలంగాణా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట స్వామి నిరుపేదలకు శుభవార్త చెప్పారు. సింగరేణి పరిధిలోని భూముల్లో దశాబ్దాలుగా నివసించే పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ క్యాతనపల్లి మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

సింగరేణి ఓపెన్ కాస్ట్ పరిధిలో ప్రజల బాధలు విన్న మంత్రి
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో కొత్తగా నిర్మించనున్న మురుగునీటి కాల్వల పనులకు భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలు, కాలనీల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు తమ బాధలను మంత్రికి విన్నవించుకున్నారు. ముఖ్యంగా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గనుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.

House Pattas for the Poor in Singareni Area Minister Vivek Venkataswamy

మౌలిక వసతులు, పునరావాసం కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి
గనుల్లో భారీ పేలుళ్ల వల్ల ఇళ్లకు పగుళ్లు, కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఓపెన్ కాస్ట్ నుంచి వచ్చే దుమ్ము, ధూళి శ్వాసకోశ అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని మంత్రికి తెలిపారు. ఈ ప్రాంతాన్ని ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి, మెరుగైన పునరావాసం, మౌలిక వసతులు కల్పించాలని వారు మంత్రిని కోరారు.

సింగరేణి స్థలాల్లోని ఇళ్లను క్రమబద్ధీకరించాలని కోరిన ప్రజలు
ప్రజల విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో నిలిచిపోయిన 76 జీవోను అమలు చేసి, సింగరేణి స్థలాల్లోని ఇళ్లను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరారు. దీనిపై స్పందించిన మంత్రి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చించి, అర్హులందరికీ పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

వారికి మంత్రి వివేక్ వేంకటస్వామి హామీ
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సాయం, విద్యుత్ స్తంభాలు, సీసీ రోడ్ల వంటి మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. కాలనీల్లో బెల్ట్ షాపుల వల్ల శాంతిభద్రతల సమస్యలు, మహిళలకు ఇబ్బందులు వస్తున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళగా.. వాటిని వెంటనే తొలగించాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.

ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు
ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పేదల పక్షాన నిలబడి, సింగరేణి ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు.

పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు
కాగా రాష్ట్ర సమగ్రాభివృద్దే లక్ష్యంగా మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కూడా నేడు ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న వడ్లకు బోనస్ లాంటి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+