వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో భారీగా హవాల సొమ్ము పట్టివేత..! ఆధారాలు చూప‌క‌పోతే అంతే అంటున్న పోలీసులు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ఎన్నికల వేళ నగరంలో 90 లక్షల హవాలా డబ్బు వెలుగు చూసింది. నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో హవాలా రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తు న్నామన్నారు. కాచిగూడ, సుల్తాన్‌ బజార్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో హవాలా వ్యాపారం నిర్వహిస్తున్న గ్యాంగ్ సభ్యులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు వ్యక్తులు వేర్వేరుగా బస్సుల్లో నగదు తరలిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించారు.

లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తా, నన్నూ లాగారు.. కపిల్ సిబాల్‌పై దావా వేస్తా: కిషన్ రెడ్డి లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తా, నన్నూ లాగారు.. కపిల్ సిబాల్‌పై దావా వేస్తా: కిషన్ రెడ్డి

వీరి నుండి 90 లక్షల రూపాయ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటీ ఆధారాలు విచారణ సమయంలో చూపించలేదని సీపీ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు.నగర కమిషనరేట్‌ పరిధిలో మరో హవాలా రాకెట్‌ గుట్టురట్టయింది. ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించి, నలుగురు వ్యాపారుల నుంచి 90.50 లక్షల రూపాయ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా కాచీగూడ, సుల్తానాబాద్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు పోలీసులు చేపట్టారు. వేర్వేరుగా వాహనాల్లో నగదు తరలిస్తున్న వ్యాపారులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Huge amount of havala money in Hyderabad ..!If the evidence does not show amount should ceased..!!

దేవేష్‌ కొటారి అనే వ్యక్తి వద్ద 50 లక్షల రూపాయ‌లు స్వాధీనం చేసుకోగా, భక్తిప్రజాపతి వద్ద 23 లక్షలు, నసీమ్‌ వద్ద 5.70 లక్షలు, విశాల్‌ జైన్‌ వద్ద 11.80 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. వీటికి నిందితులు ఎలాంటి ఆధారాలు చూపించలేదని చెప్పారు.

వీరు గత కొంత కాలంగా వేర్వేరుగా హవాలా వ్యాపారం నిర్వహిస్తూ డబ్బులు తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. వీరి వద్ద నుంచి మూడు క్యాష్‌ కౌంటింగ్‌ యంత్రాలతోపాటు నాలుగు ద్విచక్రవాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50వేల రూపాయలకు మించి ఎక్కువ వెంట ఉంచుకోవద్దని, అంతకంటే ఎక్కువ డబ్బు ఉంటే దానికి తగిన ఆధారాలు చూపాలని సీపి స్ప‌ష్టం చేసారు.

English summary
Another Hawala rocket is under the city commissionerate. East Zone Task Force Police busted this racket and seized 90.50 lakh rupees from four traders. According to the Election Code, police checks have been carried out under the control of Kacheguda and Sultanabad police stations. Separately, they were detained by merchants moving cash in vehicles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X