వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ తగ్గేదేలే.. టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు; 33వెరైటీల పసందైన వంటకాలు!!

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం ముస్తాబైంది. ఎటు చూసినా హైదరాబాద్ గులాబీ మయంగా కనిపిస్తుంది. 27వ తేదీన టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం మేరకు ప్లీనరీకి సంబంధించిన భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు స్వయంగా దగ్గరుండి ప్లీనరీ ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తున్నారు.

టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం.. హాజరుకానున్న ప్రతినిధులు

టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం.. హాజరుకానున్న ప్రతినిధులు


మాదాపూర్లోని హెచ్ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగుతున్న ఈ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన అన్ని జిల్లాలకు చెందిన ప్రతినిధులు నగరానికి వస్తున్నారు. ఇప్పటికే వీరి కోసం బార్ కోడ్ తో కూడిన ప్రత్యేక పాస్ లను అందించారు. ఇక బార్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే ప్రతినిధులను లోనికి అముమతిస్తారు. ఈ ప్లీనరీకి మొత్తం మూడు వేల మండి ప్రతినిధులకు ఆహ్వానం అందింది. ఈ ప్లీనరీలో 11 అంశాలపై చర్చించి రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ జండా పండుగను నిర్వహించనున్నారు.

ప్లీనరీకి హాజరయ్యే వారికికి నోరూరించే వంటకాలు

ప్లీనరీకి హాజరయ్యే వారికికి నోరూరించే వంటకాలు

ఇప్పటికే ప్లీనరీ కోసం నగరం నలువైపులా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇక ప్రధాన కూడళ్లలో గులాబీ జెండాలు, అధినేతల ఫొటోలతో ప్లీనరీకి వస్తున్న అతిథులకు గ్రాండ్ వెల్ కమ్ చెప్తున్నారు. అంతేకాదు ప్లీనరీకి హాజరయ్యే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. చాలా గ్రాండ్ గా విందు భోజనాన్ని ప్లాన్ చేసిన టిఆర్ఎస్ పార్టీ మొత్తం ముప్పై మూడు రకాల వెరైటీలను ప్లీనరీకి వస్తున్న ప్రజాప్రతినిధుల కోసం తయారు చేస్తోంది.

టీఆర్ఎస్ ప్లీనరీ మెనూ ఇదే

టీఆర్ఎస్ ప్లీనరీ మెనూ ఇదే

ప్లీనరీలోని వంటల ప్రాంగణం రుచికరమైన వంటకాలతో ఘుమ ఘుమలాడుతూ ప్రతినిధులకు స్వాగతం పలకనుంది . ఇక టీఆర్ఎస్ ప్లీనరీ మెనూ విషయానికి వస్తే చాలా గ్రాండ్ గా ఉండేలా ఫుడ్ ప్లాన్ చేశారు. డబల్ క మీఠా, గులాబ్ జామ్, మిర్చి బజ్జి, రుమాలి రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, దమ్ కా చికెన్, చికెన్ దమ్ బిర్యాని, మటన్ కర్రీ, తలకాయ కూర, బోటి దాల్చా, కోడి గుడ్డు పులుసు, బగారా రైస్ తదితర వెరైటీలను వండనున్నారు.

మెనూలో 33 వెరైటీల వంటకాలు

మెనూలో 33 వెరైటీల వంటకాలు


అంతేకాదు మిర్చి గసాల కూర, ఆనియన్ రైతా , మిక్స్డ్ వెజ్ కుర్మా, వైట్ రైస్, మామిడికాయ పప్పు, దొండకాయ కాజు ఫ్రై, మునక్కాడ కాజు టమాటా కర్రీ, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, వెల్లిపాయ కారం, టమాటా కొత్తిమీర పచ్చడి, మామిడికాయ పచ్చడి, పచ్చి పులుసు, పప్పు చారు, అప్పడం, ఉలవచారు, టమాటా రసం, పెరుగు, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్, బటర్ మిల్క్ మొత్తం 33 వెరైటీలను మెనూ గా నిర్ణయించారు. ప్లీనరీకి వచ్చే వారి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫుడ్ అందించే ఏర్పాటు చేస్తున్నారు.

English summary
The city of Hyderabad is all set for the TRS Party's most ambitious party plenary. 33 varieties of favorite dishes will be prepared for the delegates coming to the Plenary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X