కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది..!
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయా అంటే అవుననే అంటున్నారు నగర వాసులు. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో కరెంట్ సరిగా ఉండటం లేదని నగర ప్రజలు వాపోతున్నారు. దీంతో కొందరు రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..మిచౌంగ్ తుపాను ప్రభావం తెలంగాణలో కూడా కనిపించింది.
ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ వంటి పలు జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు జలయమయ్యాయి. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కరెంట్ కట్ అయింది. కొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు గంటలపాటు చికట్లోనే నగర ప్రజలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై నగర వాసులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నపాటి వర్షానికే ఇలా గంటల గంటలు కరెంట్ తీస్తే.. వర్షకాలంలో అసలు కరెంట్ ఉంటుందా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది... రాష్ట్రంలో కరెంట్ పోయిందంటూ కామెంట్ చేస్తున్నారు.
కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దంటే వినలేదు..ఇప్పుడు చూడండి కరెంట్ కష్టాలు మొదలైయ్యాయి అంటూ మరికొందరు వీడియోలు పెడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారం చేపట్టకముందే కరెంట్ కష్టాలు ఇలా ఉన్నాయంటే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో అని హైదరాబాద్ ప్రజలు భయపడిపోతున్నారు. మరి కరెంట్ సమస్యను కొత్తగా ఏర్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి












Click it and Unblock the Notifications