• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమంతకు గుడ్ న్యూస్ - కష్టసమయంలో భారీ రిలీఫ్ : ఎమెషనల్ కామెంట్స్..ఆ వెంటనే...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

స్టార్ హీరోయిన్ సమంతకు గుడ్ న్యూస్. కొంత కాలంగా సమంత నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత సమంత పైన మరింతగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో సమయంత ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ కీలక వ్యాఖ్యలు చేసారు. సమయంత ఎమోషనల్ అవుతూ..అసలు ఆ సమయంలో తాను ఏమయిపోతానో అనే భయం వేసిందని చెప్పుకొచ్చారు. ఇక, దీనికి కొనసాగింపుగా మరో ఇంటర్వ్యూలోనూ సమంత భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న ట్రోలింగ్ పైన రియాక్ట్ అయ్యారు.

పోస్టింగులు సరి కాదంటూ

పోస్టింగులు సరి కాదంటూ

తన పైన ఇష్టానుసారం పోస్టింగ్ లు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. తాజాగా ఆమె విక్కీ కౌశల్, తాప్సీతో కలిసి ఓ బాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సమంత తన పర్సనల్ విషయాలపై ఎమోషనల్ అయ్యారు. తాను ఎంతో కష్టపడి నా కెరీర్‌ను నిర్మించుకున్నానని చెప్పుకొచ్చారు. 2021 సంవత్సరం తన వ్యక్తిగత జీవితానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేసారు. తన ఆశలన్నీ శిథిలమైయ్యాయంటూ చెప్పుకొచ్చారు.

మనోవేదనకు గురయ్యాను

ఎంతో మనోవేదనకు గురయ్యానని చెప్పిన సమంత..సోషల్ మీడియా పరంగా కొందరు తనకు సపోర్ట్ చేస్తే.. మరికొందరు అసభ్యకర కామెంట్స్‌తో తనను ట్రోల్ చేస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యారు. తాను ట్రోల్ చేసేవారికి..తనంటే నచ్చని వారికి చెప్పేది ఒక్కటే నంటూ సమంత కొన్ని సూచనలు చేసారు. తన అభిప్రాయాలు వీరికి నచ్చాలని రూలేం లేదని... కాకపోతే దానిని వ్యక్తపరిచే విధానం అయితే ఇది కాదని స్పష్టంగా తేల్చి చెప్పారు. తన పై ఇష్టానుసారం అసభ్యకరంగా పోస్టులు పెట్టడం సరికాదన్నారు.

వెబ్ సిరీస్ కు అవార్డు

వెబ్ సిరీస్ కు అవార్డు

దీంతో.. రాబోయే నూతన సంవత్సరంపై ఎటువంటి ఆశలూ పెట్టుకోలేదని వెల్లడించారు. భవిష్యత్‌ కాలం ఎలా ఉన్నా ధైర్యంగా స్వీకరించడానికి సిద్దంగా ఉన్నానంటూ సమంత వెల్లడించారు. ఇటువంటి ఉద్వేగ పరిస్థితుల్లో ఉన్న సమంతకు గుడ్ న్యూస్ అందింది. సమంతకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది. తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మెప్పించిన సమంత సక్సెస్ ఫుల్ గా చేసిన వెబ్ సిరీస్ కు అవార్డు తక్కింది. 'ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2' ద్వారా వెబ్ సిరీస్ లో సమంత ఎంట్రీ ఇచ్చారు.

Recommended Video

Priyanka Chopra - Nick Jonas విడాకులు.. సెన్సేషనల్ రూమర్...!! || Oneindia Telugu
సమంత నటనకు ప్రశంసలు

సమంత నటనకు ప్రశంసలు

దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ఇందులో సమంత 'రాజీ' అనే పాత్రలో నటించారు. ది ఫ్యామిలీ మాన్ సీజన్ 1' కు కొనసాగింపుగా దీనిని నిర్మించారు. ఇందులో సమంత నటను విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. కాగా, సమంత నటనకు అవార్డు దక్కినట్లుగా స్వయంగా ఫిల్మ్ ఫేర్ అధికారికంగా ప్రకటించింది. దీని పైన స్పందించిన సమంత వారికి థాంక్స్ చెబుతూ రీ ట్వీట్ చేసారు.

English summary
Huge relief for Samantha at tough times as she bags film fare best actress award in Drama series
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X