భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య: ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

Subscribe to Oneindia Telugu

వరంగల్‌: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బీరిశెట్టిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... బీరిశెట్టిగూ డెం గ్రామానికి చెందిన మిడతపల్లి వెంకటయ్య, వీరమ్మల కుమార్తె స్వరూప (25)కు మాటేడు గ్రామానికి చెందిన మహంకాళి అశోక్‌తో 2012లో వివాహం జరిగింది. అయితే వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు గడిచినా పిల్లలు లేకపోవడంతో అశోక్‌ స్వరూపను తరచూ వేధించేవాడు.

భర్త వేధింపులు ఎక్కువవడంతో స్వరూప బీరిశెట్టిగూడెంలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.
ఈ క్రమంలో తాను మరొక పెళ్లి చేసుకుంటానని, ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని స్వరూపను తన ఇంటి వద్దకు వచ్చి వేధించగా ఆమె నిరాకరించింది. అనంతరం అశోక్‌ వెళ్లిపోయిన తర్వాత మనస్తాపానికి గురైన స్వరూప పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

Husband harassment: woman committed suicide

తో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. స్వరూప మృతదేహానన్ని స్వగ్రామానికి తరలించారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

వేలేరు మండలం గుండ్లసాగర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులు కనిపించడం లేదంటూ మంగళవారం వారి తల్లిదండ్రులు ధర్మసాగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గాదె జ్యోతి (17), దేవరాజుల వందన (17)లు కరుణాపురంలోని జేఎంజే జూనియర్‌ కళాశాలలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.

సోమవారం ఉదయం వీరు కళాశాలకు వెళ్లి తిరిగిరాలేదని పేర్కొన్నారు. సోమవారం ఈ విద్యార్థినులు కళాశాలకు హాజరు కాలేదని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ శౌరీలు చెప్పాడని, బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై విజయ్‌రాంకుమార్‌ తెలిపారు.

విద్యార్థినులు ప్రతి రోజూ గుండ్లసాగర్‌ నుంచి తాటికాయల మీదుగా చిన్న పెండ్యాల వరకు ప్రైవేటు పాఠశాల బస్సులో వెళ్తారని, అక్కడి నుంచి కరుణాపురం వరకు ఆర్‌టీసీ బస్సుల్లో, లేదా ఆటోలో వెళ్తారని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం గుండ్లసాగర్‌కు చెందిన ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌కు ఆ విద్యార్థినుల్లో ఒకరు ఫోన్‌ చేశారని, తమకు మత్తు మందు చల్లి ఎవరో ఆటోలో తీసుకెళ్లారని, ఎక్కడ ఉన్నామో తెలియదని చెప్పిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ విద్యార్థిని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉందన్నారు.ఫోన్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman allegedly committed suicide in Warangal district, due to husband harassment.
Please Wait while comments are loading...